
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ డిజిటల్ విభాగం ఎక్స్‌టెలిఫై సోమవారం 'ఎయిర్‌టెల్ క్లౌడ్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. టెలికాం ఎంటర్‌ప్రైజెస్ కోసం రూపొందించిన ఏఐ- ఆధారిత సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ల కొత్త సూట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ "ఇంటిలీట్- ఇన్- ఇండియా" టెల్కో-గ్రేడ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-యాజ్-ఎ- సర్వీస్ (ఐఏఏఎస్), ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్) కనెక్టివిటీని అందిస్తుంది.
నిమిషానికి 140 కోట్ల లావాదేవీలను నిర్వహించడానికి డెవలప్‌చేసిన ఈ సావరిన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు భారతదేశంలోని వ్యాపారాల అవసరాలను తీర్చడానికి అందుబాటులోకి తెచ్చామని ఎక్స్‌టెలిఫై తెలిపింది. తమ సేవల వల్ల భారతీయ వ్యాపారాల క్లౌడ్ ఖర్చులు 40 శాతం వరకు తగ్గుతాయని తెలిపింది.ఈ సాఫ్ట్‌వేర్ సూట్‌లో నాలుగు ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు - వర్క్, సర్వ్, డేటా ఇంజిన్ ఎయిర్‌టెల్ ఐక్యూ ఉంటాయి.