నారాయణ కంటెంట్‌‌పై నమ్మకముంది 

నారాయణ కంటెంట్‌‌పై నమ్మకముంది 

శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేశారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ‘మేము యూనిక్‌‌గా చేసిన ప్రమోషన్స్‌‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం, గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్స్‌‌కు వస్తుండడంతో సినిమాపై మా నమ్మకం మరింత పెరిగింది’ అని అన్నాడు. ‘అందరినీ అలరించి, పెద్ద విజయం సాధిస్తుంది’ అని రాశీ సింగ్ చెప్పింది. ‘సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అందరినీ నచ్చుతుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. రాజ్ కందుకూరి, శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.