
- తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులు
- భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో ఘటన
రేగొండ, వెలుగు : అక్క తమ మాట వినకుండా ప్రేమ పెండ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన యువతి సోదరుడు కత్తితో హత్యకు యత్నించాడు. దీంతో యువతితో పాటు ఆమె అత్త తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన కౌటం ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన బాషవేణి జ్యోతి మూడు నెలల కింద ప్రేమ పెండ్లి చేసుకున్నారు.
వీరు కొన్ని రోజులు వేరే ప్రాంతంలో ఉండి ఇటీవలే సొంతూరు వెళ్లారు. జ్యోతి తమ్ముడు సాయి శనివారం ఆమెపై, ప్రశాంత్ తల్లి లక్ష్మిపై కత్తితో హత్యకు యత్నించాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.