బాలీవుడ్ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూత

 బాలీవుడ్ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూత
  • హిందీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ సింగర్ భూపిందర్ సింగ్
  • దమ్ మారో దమ్.. చురాలియా హై.. మెహబూబా మెహబూబా.. తదితర పాటలు పాడిన భూపిందర్
  • ప్రధాని మోడీ సహా ప్రముఖుల నివాళి

ముంబయి: బాలీవుడ్ లెజండరీ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూశారు. 82 ఏళ్ల భూపిందర్ సింగ్ గత కొంత కాలంగా కోలన్ క్యాన్సర్, కొవిడ్ తో  చికిత్స పొందుతున్నారు. నిన్న ముంబైలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు తెలిపారు ఆయన భార్య సింగర్ మిథాలీ. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు భూపీందర్ సింగ్. కిషోర్ కుమార్, రఫీ వంటి గొప్ప సింగర్స్ తోనూ పాటలు పాడారు. మౌసమ్, ఆహిస్తా ఆహిస్తా, దూరియా, హఖీఖత్ వంటి చిత్రాల్లో భూపిందర్ పాడిన పాటలు ప్రేక్షకులకు ఎంతగానే చేరువయ్యాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన హెవీ బేస్ టోన్ తో ప్రత్తేక గుర్తింపు తెచ్చుకున్నారు. భూపిందర్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
భూపిందర్ సింగ్ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా కెరీర్ ను ప్రారంభించారు. ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ మదన్ మోహన్ దృష్టిలో పడి మూవీ ఛాన్సెస్ అందుకున్నారు. 1964 లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖత్ ఆయన తొలి చిత్రం. అయితే ఆయన సోలో ట్రాక్ మాత్రం రెండేళ్ల తర్వాత అఖ్రీఖాట్ మూవీలో రుత్ జవాన్ జవాన్ రాత్ మెహర్ బాన్ తో ప్రారంభమైంది. 1980లో సినిమాలకు దూరమైన భూపిందర్ సింగ్.. తర్వాత భార్య మిథాలీతో కలిసి ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు.
భూపిందర్ ప్రసిద్ధ పాటల్లో హోకే మజ్బూర్ ముజే, ఉస్నే బులాయా హోగా, దిల్ ధూంధతా హే, దుకీ పే దుకీ హో యా.. ఇలా మరెన్నో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. కేవలం సింగర్ గానే కాకుండా... గిటారిస్ట్ హరేరామా హరే కృష్ణ మూవీలో దమ్ మారో దమ్, యాదోన్ కీ బారాత్ మూవీలో చురా లియా హై, హింగార్ కోయ్ భడ్కే, షోలే మూవీలోని మెహబూబా ఓ మెహబూబా పాటలకు పని చేశారు. లెజండరీ సింగర్ భూపిందర్ మృతి పట్ల ప్రధాని మోడీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


1982లో వచ్చిన ధర్మ కాంటా మూవీలో 'దునియా ఛుట్టే యార్‌ న ఛుట్టే'తో పాటు 1983లో వచ్చిన మాసూమ్‌ మూవీలో 'హుజూర్‌ ఇస్‌ కదర్‌కా.. అదే ఊపులో దమ్ మారో దమ్.. చురాలియా హై, చింగారి కోయి బడ్కే.. మెహబూబా ఓ మెహబూబా.. వంటి ఆల్ టైం హిట్‌ పాటలను పాడారు. బాలీవుడ్ లెజెండ్స్  మహమ్మద్‌ రఫి, లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే, బప్పీలహరి, ఆర్డీ బర్మన్‌ తదితరులతో కలసి పనిచేశారు. గజల్ గాయకుడు భూపిందర్‌ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.