వేధింపులపై పోరాడుతున్న భూటాన్ కండక్టర్‌

వేధింపులపై పోరాడుతున్న భూటాన్ కండక్టర్‌

ఆడవాళ్ల భద్రత.. ఆందోళనకరమైన ఒక సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఆడవాళ్ల చేతుల్లోనే ఉందనుకుంది కెల్‌‌‌‌సాంగ్ షోమో.
సొసైటీలో మగవాళ్ల మధ్య  గౌరవంగా బతకాలంటే ఆడవాళ్లకు ఆడవాళ్లే సపోర్ట్‌‌‌‌ చేయడం అవసరం అనుకుందామె.  అలా ఒకరికి ఒకరు సాయం అందించుకున్నప్పుడే నిజమైన ఎంపవర్‌‌‌‌మెంట్ సాధించగలమన్న నమ్మకంతో కెల్‌‌‌‌సాంగ్ ముందుకెళ్తోంది. ఆ మార్పు కోసమే కౌన్సెలింగ్‌‌‌‌తో ధైర్యం పంచుతోంది.

 

కరోనా, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైంలో ప్రపంచం మొత్తం మీద ఆడవాళ్లు, పిల్లలపై వేధింపులు పెరిగాయి.  డొమెస్టిక్‌‌‌‌ వయొలెన్స్‌‌‌‌ కేసుల గురించి భూటాన్‌‌‌‌ రాణి జెట్సన్ పెమా వాంగ్చుక్ ఓపెన్‌‌‌‌గా మాట్లాడింది కూడా.  అప్పుడే షోమో తన కొలీగ్స్‌‌‌‌, ఫ్రెండ్స్‌‌‌‌ బాగోగుల గురించి ఆరాతీసింది.  ఆమె భూటాన్‌‌‌‌లోని థింపు సిటీలో బస్‌‌‌‌ కండక్టర్‌‌‌‌గా పని చేస్తోంది.  ఒకవేళ ఎవరైనా వేధింపులకు గురవుతారని తెలిస్తే..  వెంటనే వాళ్లకు సాయం అందించింది. ఎబ్యూజింగ్‌‌‌‌ అనేది ‘వెర్బల్ , ఎమోషనల్‌‌‌‌, సెక్సువల్‌‌‌‌,  ఫిజికల్‌‌‌‌’..  ఎలాగైనా ఉండొచ్చు. వాటిని భరించాల్సిన అవసరం లేదని చెబుతుంది ఆమె. ఇదే విషయాన్ని వీలైనంత మందికి చెప్పి మోటివేట్ చేయాలని బాధితులను కోరుతుంది కూడా.

సపోర్ట్ కోసం

కెల్‌‌‌‌సాంగ్ షోమా వయసు నలభై లోపే. పదిహేనేళ్లుగా  కండక్టర్‌‌‌‌గా పని చేస్తోంది.  అంతేకాదు లోకల్‌‌‌‌గా ఉన్న ఓ ఎన్జీవోలో ‘హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌’ సెషన్స్‌‌‌‌లో  రెగ్యులర్‌‌‌‌గా పాల్గొంటోంది.  అందుకే ఆమెకు జెండర్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ వయొలెన్స్‌‌‌‌ పెద్ద సమస్యగా అనిపించదు.  కానీ, వాటి పరిష్కారం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుంది.  షోమా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు.  నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్న ఫ్యామిలీలో పెరిగిందామె.  చదువు పక్కనపెట్టి..  కుటుంబాన్ని పోషించడానికి కండక్టర్‌‌‌‌గా మారింది. అప్పటి నుంచి సొసైటీలో ఎదుర్కొన్న ఇబ్బందులే..  వంద మందికి హక్కుల గురించి చెప్పే కౌన్సెలర్‌‌‌‌గా ఆమెను మార్చాయి.  డొమెస్టిక్‌‌‌‌ వయొలెన్స్‌‌‌‌, పర్సనల్ ఎబ్యూజ్‌‌‌‌ లాంటి టాపిక్స్‌‌‌‌పై చర్చతో  ఆమె ఆడవాళ్లను ఎంగేజ్‌‌‌‌ చేస్తుంది.  ఆ చర్చల్లోనే వాటికి పరిష్కారాలను వాళ్లతోనే చెప్పిస్తుందామె.

బస్సుల్లో తిరుగుతూ..

పబ్లిక్‌‌‌‌ ప్లేసుల్లో వేధింపుల విషయంలో దక్షిణాసియా దేశాలు ముందున్నాయి. ఆ లిస్ట్‌‌‌‌లో భూటాన్‌‌‌‌ ఫస్ట్ ప్లేసులో ఉంది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా ఆడవాళ్ల విషయంలో వయొలెన్స్ 37 శాతం పెరిగింది. చివరికి ప్రయాణాల్లోనూ ఈ వేధింపులు తప్పడం లేదు. అందుకే బస్సుల్లో తన తోటి కండక్టర్లతో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది షోమా అండ్ టీం. పబ్లిక్‌‌‌‌ ప్లేసుల్లో అసభ్యంగా మాట్లాడడం, వల్గర్‌‌‌‌ కామెంట్లు చేయడం.. తాకడం లాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆడవాళ్లు ఎలా రియాక్ట్ కావాలి.  ఆ టైంలో హెల్ప్‌‌‌‌ లైన్‌‌‌‌ని ఎలా అప్రోచ్‌‌‌‌ అవ్వాలి అనేది వివరంగా చెప్తుంది షోమా టీం. అంతేకాదు ఈ విషయాల్ని మరికొందరికి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది కూడా.  ఒకవేళ పరిస్థితి మరీ చెయ్యి దాటితే..  ప్రొటక్షన్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ టీంకి నేరుగా కాంటాక్ట్ అయ్యేలా టోల్‌‌‌‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయించింది.  ఇప్పటివరకు తన టీంలో వంద మందికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు థింపు సిటీ బస్సుల్లో తిరుగుతూ స్వయంగా క్యాంపెయిన్‌‌‌‌ నడిపిస్తోంది షోమా. విచిత్రం ఏంటంటే..
ఈవ్ టీజర్లు, వేధింపు రాయుళ్ల భరతం పడుతున్న ఈ క్యాంపెయిన్‌‌‌‌ను వయసు మళ్లిన కొందరు ఆడవాళ్లు తప్పుపడుతున్నారట. అయినా కూడా ‘డోంట్ కేర్‌‌‌‌’ అంటోంది ఈ కండక్టరమ్మ.