కమాంధుడిగా మారిన స్కూల్ కరస్పాండెంట్

కమాంధుడిగా మారిన స్కూల్ కరస్పాండెంట్

భువనగిరిలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కమాంధుడిలా మారి ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భువనగిరి జిల్లా కేంద్రలోని కృష్ణవేణి టాలెంట్ స్యూల్ కు చెందిన ఓ 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. 

ఆదివారం ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినిని తన ఛాంబర్ కు పిలిపోయించుకున్నాడు. ఛాంబర్ లో విద్యార్థిని పట్ల అసభ్య కరంగా ప్రవర్తించాడు. దాంతో విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చి కరస్పాండెంట్ ను నిలదీశారు. రఘు వెంకట సురేష్ కుమార్ పై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యదు చేయగా.. అదుపులోకి తీసుకున్నారు.