అర్హులందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి

అర్హులందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి

యాదాద్రి, వెలుగు : అర్హులందరికీ రేషన్​ కార్డులు ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​తెలిపారు. భువనగిరి, మోత్కూరు, అడ్డగూడూరులో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు లబ్ధిదారులకు రేషన్​కార్డులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లు ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. తమది పేదల ప్రభుత్వం కాబట్టే.. అందరికీ ఇస్తున్నామని తెలిపారు. 

అనంతరం వలిగొండ మండలం పొద్దుటూరు, ఏదుల్లగూడెం, మాందాపురం, నాతాళ్లగూడెం, అక్కంపల్లి, దాసిరెడ్డిగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ స్కీంలో రూ.1.91 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుంభం శంకుస్థాపన చేశారు. వలిగొండ మార్కెట్ యార్డులో రూ. 1.41 కోట్లతో చేపట్టే షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 48 మందికి సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.