
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే తొలి మ్యాచ్‌కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కొత్తగా అపాయింట్ అయిన సారథి ఐడెన్ మార్‌క్రమ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్.. రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం మార్‌క్రమ్ ఇంకా సౌతాఫ్రికాలోనే ఉన్నాడు.
వన్డే వరల్డ్‌కప్‌కు డైరెక్ట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు కావడంతో అతను కచ్చితంగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఏప్రిల్ 3న మార్‌క్రమ్ ఇండియాకు రానున్నాడు. ఏప్రిల్ 7న లక్నోతో జరిగే మ్యాచ్‌కు మార్‌క్రమ్ సారథ్యం వహించనున్నాడు.