
బిచ్చగాడు 2 మూవీ హీరో విజయ్ అంటోనీ తిరుపతిలో హల చల్ చేశాడు. బిచ్చగాడు 2 సినిమా విజయోత్సవంలో భాగంగా తిరుపతిలోని సినిమా హాల్లో సందడి చేశాడు. దీంతో విజయ్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమా హాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు బిచ్చగాడు,బిచ్చగాడు 2 సినిమాలకు సీక్వెల్ గా బిచ్చగాడు 3 కూడా తీస్తానని చెప్పుకొచ్చాడు.
ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 మూవీకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా 4 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా దాటేసింది. దీంతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. బిచ్చగాడు మాతృక తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి.
అందుకే, తెలుగు ఆడియన్స్ కలవడానికి, వాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి తెలుగు రాష్ట్రాలో పర్యటించాడు విజయ్. ఇక బిచ్చగాడు, బిచ్చగాడు2 సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న విజయ్.. బిచ్చగాడు3తో ఎలాంటి రికార్స్ద్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.