మళ్లీ తడబడ్డ బైడెన్.. కమలా హారిస్​ను ప్రెసిడెంట్ అని పిలిచి నవ్వులపాలు

మళ్లీ తడబడ్డ బైడెన్.. కమలా హారిస్​ను ప్రెసిడెంట్ అని పిలిచి నవ్వులపాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్​ను పొరపాటున ప్రెసిడెంట్ అని పిలిచి మళ్లీ నవ్వుల పాలయ్యారు. స్టాన్లీ కప్ గెలిచిన వెగాస్ గోల్డెన్ నైట్స్ టీమ్​ను సత్కరించేందుకు సోమవారం వైట్ హౌస్​లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడు తూ.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్​ను ప్రెసిడెంట్ అని పిలిచారు. దీంతో అక్కడున్నోళ్లందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తూ, బైడెన్​పై కామెంట్లు చేస్తున్నారు.

ఆయనకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవ రో కూడా తెలియదా? అని విమర్శిస్తున్నా రు. కాగా, బైడెన్ ఇలా తడబడడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆరుసార్లు ఇలాగే చేశారు. 2022లో కమలా హారిస్ బర్త్ డే సందర్భంగా వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘హ్యాపీ బర్త్ డే టు గ్రేట్ ప్రెసిడెంట్’ అని అన్నారు.