హైదరాబాద్ కేంద్రాల్లో రేపు (ఏప్రిల్ 8) ఎస్ఐ, ఏఎస్ఐ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు డీజీపీ అంజనీ కుమార్ కీలక సూచనలు చేశారు. శనివారం రోజు ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ ఉన్నందున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
ఈ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు తమ జర్నీ ప్లాన్ చేసుకోవాలని డీజీపీ తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు బయల్దేరాలని సూచించారు. రేపు ఉదయం10 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య పరీక్షలు జరుగనున్నాయి. అటు ప్రధాని మోడీ ఉదయం11.30 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు.
