Ram Charan, Buchi babu: RC16లో మరో పాన్ ఇండియా స్టార్.. ఇది నెక్స్ట్ లెవల్ కాంబో

Ram Charan, Buchi babu: RC16లో మరో పాన్ ఇండియా స్టార్.. ఇది నెక్స్ట్ లెవల్ కాంబో

ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత వరుసగా అన్నీ క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Adwani) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దివాళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక ఈ సినిమా తరువాత చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)తో ఓ సినిమా చేస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే స్టార్ కాస్ట్ ను తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. 

తాజాగా ఈ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ కూడా యాడ్ కాబోతున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్. అవును.. ఈ సినిమాలో మరో కీ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకోనున్నారట. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి ఆయనతో చర్చలు కూడా ముగిశాయని, పాత్ర నచ్చడంతో అమితాబ్ కూడా వెంటనే ఒకే చెప్పేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమితాబ్ రాకతో RC16 అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 22 నుండి మొదలుకానుంది అని సమాచారం. మరి భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. 

Also Read :ఈసారి బన్నీ బర్త్డే మాములుగా ఉండదు.. పుష్ప 2 నుండి స్పెషల్ ట్రీట్!