Allu Arjun Birthday: ఈసారి బన్నీ బర్త్డే మాములుగా ఉండదు.. పుష్ప 2 నుండి స్పెషల్ ట్రీట్!

Allu Arjun Birthday: ఈసారి బన్నీ బర్త్డే మాములుగా ఉండదు.. పుష్ప 2 నుండి స్పెషల్ ట్రీట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukunar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కారణంగా.. పార్ట్ 2పై రోజురోజుకి హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది.అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎక్కడ రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.  

also read : నితిన్తో హనుమాన్ మేకర్స్.. ఈసారి మరింత భారీగా!

అదేంటంటే..  చాలా కాలంగా పుష్ప 2 అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ, ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ట్రీట్ అరేంజ్ చేశారట పుష్ప2 మేకర్స్. అవును.. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేశారట. అయితే అది ఎలాంటి అప్డేట్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సినిమా రిలీజ్ కు మరో నాలుగు నెలల టైం ఉంది కాబట్టి.. ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేసి సినిమాపై హైపు క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్  నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.