భగవంత్ కేసరిలో బిగ్ బాస్ బ్యూటీ.. బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్

భగవంత్ కేసరిలో బిగ్ బాస్ బ్యూటీ.. బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)- సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth kesari). ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్​ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చూసి ఆడియన్స్ అవాక్కవుతన్నారు. అదేంటంటే.. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్‌ ఒక కీలక పాత్రలో కనిపించారు.  

ప్రస్తుతం ప్రసారం అవుతున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌7 దాదాపు నాలుగు వారాల పాటు ఆడియన్స్ ను అలరించారు రతికా. అనూహ్యంగా ఐదోవారంలో ఇంటినుండి ఎలిమినేట్ అయ్యారు రతికా. అయితే భగవంత్ కేసరి సినిమా విడుదలయ్యే వరకు ఈ సినిమాలో ఆమె ఉన్నట్లు చిన్న హింట్ కూడా బయటకు రాలేదు.

సడన్ గా ఆమెను సినిమాలో చూసి ఆడియన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఈ సినిమాలో రతికా ఎమ్మెల్యే పాత్రలో కనిపించారు. కేవలం ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే మహిళా ఎమ్మెల్యేగా తనదైన కామెడీ పండించారు రతిక. ఇక స్క్రీన్‌పై రతికా రోజ్‌ కనిపించగానే..  ఈలలతో రెచ్చిపోయారు ఆడియన్స్. ఇక గతంలో.. నారప్ప, కార్తికేయ, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు బిగ్ బాస్ తరువాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా అవాకాశం దక్కించుకుంది రతికా. ఈ విషయాన్ని స్వయంగా రతికనే క్లారిఫై చేసింది.