
ఇది ఇండియా బిగ్ బ్రేకింగ్.. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేసిన ఘటనలో.. మన భారత సైన్యం కీలక ముందడుగు వేసింది. టెర్రిస్టుల కోసం జమ్మూకాశ్మీర్‌ను జల్లెడ పడుతున్న సమయంలో.. ఓ టెర్రరిస్టు మన ఆర్మీ చేతికి చిక్కాడు. ఆ టెర్రరిస్టు పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తుంది మన ఆర్మీ.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో నరమేధం సృష్టించి 26 మంది అమాయక ప్రజలను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రమూకల కోసం భారత భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్న పట్టుకోవాలని అణవుఅణువునా జల్లెడ పడుతున్నాయి. టెర్రర్ ఎటాక్ జరిగిన బైసరన్ లోయ చుట్టూ ఉన్న అడవుల్లో మంగళవారం ( మే 6) భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలోనే భద్రతా దళాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్న ఓ అనుమానాస్పద వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతడిని అహ్మద్ బిలాల్‌గా గుర్తించారు. బిలాల్ కు పహల్గాం ఉగ్రదాడి ఘటనతో సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు ప్రశ్నంచగా.. సంబంధం లేని ఆన్సర్లు చెప్పినట్లు తెలిసింది.
🚨 Suspicious Man Caught With Bulletproof Jacket Cover In Basaran Valley
— OsintTV 📺 (@OsintTV) May 6, 2025
📍During a CASO in the forests around the Basaran Valley, security forces apprehended a suspicious individual yesterday.
📍The suspect, later identified as Ahmed Bilal, was wearing a bulletproof jacket… pic.twitter.com/QUwGdcaTP2