చిన్న అలవాటుతో పెద్ద రిస్క్

చిన్న అలవాటుతో పెద్ద రిస్క్

గోర్లు కొరకడం, కళ్లు నలుపుకోవడం లాంటి కొన్ని చిన్నచిన్న అలవాట్లు డైలీ లైఫ్‌‌‌‌లో మనకు తెలియకుండానే జరిగిపోతాయి. వీటి వల్ల మొన్నటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇప్పుడు మాత్రం చాలా రిస్క్ ఉంది. మనకు తెలియకుండా, అలవాటుగా చేసే కొన్ని పనులు కోవిడ్ రిస్క్‌‌‌‌ను కూడా పెంచొచ్చు. అలాంటి హ్యాబిట్స్ ఏంటంటే…

గడ్డం పెంచడం

గడ్డం పెంచడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా యూత్ రకరకాల స్టైల్స్‌‌‌‌లో గడ్డం పెంచుతుంటారు. అయితే గడ్డంతో కూడా కోవిడ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. బయట ఎక్కడో ఒక దగ్గర తాకిన చేతులతో గడ్డాన్ని ముట్టుకుంటే.. వైరస్ గడ్డంలోని వెంట్రుకలకు అంటుకుని అలాగే ఉండిపోతుంది. అలాగే గడ్డంతో ఉండే మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే.. ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చాలాసార్లు.. గడ్డం పూర్తిగా తడవదు. అలాగే పూర్తిగా క్లీన్ అవ్వదు. దాంతో వైరస్ అక్కడే కొన్ని గంటల పాటు నిలిచి ఉండే ప్రమాదముంది. అందుకే ఈ టైంలో ఎక్కువ గడ్డం పెంచడం అంత మంచిది కాదు. ఒకవేళ పెంచితే ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేస్తూ, గడ్డాన్ని క్లీన్‌‌‌‌గా ఉంచుకోవాలి.

మొబైల్ ఎక్కడ పడితే అక్కడ

చాలామంది మొబైల్‌‌‌‌ను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. అలాగే వాడిన తర్వాత మంచం మీదో, సోఫామీదో అలా విసిరేస్తుంటారు. ఈ అలవాటుతో కూడా ఎంతో రిస్క్ ఉంది ఎలాగంటే.. ఈ రోజుల్లో చేతులు ఎక్కువసేపు అంటుకుని ఉండేది మొబైల్స్‌‌‌‌నే. చేతులతో దేన్ని ముట్టుకున్నా ఆ తర్వాత వెంటనే చేత్తో పట్టుకునేది మొబైలే. అలాగే మొబైల్‌‌‌‌ను శానిటైజ్ చేయడం కూడా చాలా తక్కువ. దాంతో అంతో ఇంతో రిస్క్ ఫ్యాక్టర్ మొబైల్ రూపంలో పొంచి ఉంటుంది. అలాంటి మొబైల్‌‌‌‌ను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల వైరస్‌‌‌‌ను అన్ని సర్ఫేస్‌‌‌‌లకు అంటించినట్టవుతుంది. అందుకే మొబైల్‌‌‌‌ను దగ్గర ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం అవసరం.

సపోర్ట్ తీసుకోవడం

లిఫ్ట్‌‌‌‌లో నిల్చున్నప్పుడు, బస్, ట్రైన్స్ ఎక్కినప్పుడు లేదా ఎక్కడైనా గోడ పక్కన నిల్చున్నప్పడు తెలియకుండానే చాలామంది సపోర్ట్ తీసుకుని నిలబడతారు. అలా పక్కన ఉన్న గోడ, కుర్చీ లేదా సపోర్టింగ్ రాడ్స్‌‌‌‌కు ఆనుకోవడం వల్ల బట్టలకు వైరస్ అంటుకునే ప్రమాదముంది. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా.. చుట్టూ ఆరడుగుల వరకూ ఎలాంటి సర్ఫేస్ లేదా మనుషులు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆనుకుని నిల్చొనే అలవాటును మార్చుకోవాలి.

ఇంట్లో చెప్పులతో నడవడం

చాలామంది ఇంట్లో కూడా చెప్పుల్ని వాడుతుంటారు. వాటికోసం ఒక జత చెప్పుల్ని సెపరేట్‌‌‌‌గా పెట్టుకుంటారు. అయితే.. కోవిడ్ టైంలో ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిది. బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా.. చెప్పులు మార్చుకుని తిరగడం వల్ల వైరస్ ఇల్లంతా వ్యాపించే ప్రమాదముంది. అందుకే ఇంటి నుంచి రాగానే కాళ్లు, చేతులు కడుక్కోవడం మంచిది.

స్నానానికి బద్ధకించడం

బయటకు వెళ్లే పని లేనప్పుడు , సెలవు రోజుల్లో చాలామంది స్నానానికి బద్ధకిస్తుంటారు. స్నానం చేయకపోవడం.. చాలా రిస్క్‌‌‌‌ను తెచ్చిపెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన ఒంటి మీదో లేదా బట్టల మీదో వైరస్ ఉండి ఉంటే.. స్నానం చేస్తే పోతుంది. అలా కాకుండా బద్ధకిస్తే.. వైరస్‌‌‌‌తో పాటు మరికొన్ని ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదముంటుంది.

దగ్గరగా మాట్లాడడం

కోవిడ్ రిస్క్ తక్కువగా ఉండాలంటే.. పక్కవాళ్లతో మాట్లాడేటప్పుడు దూరంగా ఉండాలి. పక్కవాళ్లకు ఎంత దగ్గరగా ఉండి మాట్లాడితే రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస్క్ పెట్టుకుని మనుషులకు దూరంగా ఉండి మాట్లాడాలి. అది కూడా అవసరమైతేనే మాట్లాడాలి.

కుర్చీ, సోఫాలపై కాళ్లు పెట్టడం

అలాగే కుర్చీ, సోఫా లేదా మంచంపై కూర్చున్నప్పుడు కాళ్లు పైన పెట్టడం వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కాళ్లను చేతులను ఎక్కడ పెడుతున్నాం. అనే విషయంలో కేర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉండాలి. ఇక వీటితో పాటు కళ్లు నలుపుకోవడం, ముక్కు, నోటిని చేతులతో తాకడం లాంటి అలవాట్లు చాలా డేంజర్.

తప్పుగా పెట్టుకోవడం

ఒక్కోసారి సరిగ్గా జాగ్రత్తలు పాటించకపోవడం కూడా అజాగ్రత్త కిందకే వస్తుంది. వైరస్ రాకుండా మాస్క్, గ్లోస్‌ ధరించడం మంచి పనే. కానీ వాటిని పెట్టుకోవడంలో పర్ఫెక్షన్ మిస్ అయితే ఎలాంటి లాభం ఉండదు. ముఖ్యంగా గ్లోస్ తొడుక్కునే వాళ్లు, గ్లోస్ ముందు భాగానికి చేతులు అంటకుండా జాగ్రత్తగా తొడుక్కోవాలి. ఒక వేళ చేతులతో గ్లోస్‌‌‌‌ను అంటుకోవాల్సి వస్తే.. గ్లోస్ పెట్టుకున్న తర్వాత వెంటనే స్పిరిట్ లేదా శానిటైజర్‌‌‌‌‌‌‌‌తో గ్లోస్ ఉన్న చేతుల్ని క్లీన్ చేసుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం