బోధన్ ​బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్

బోధన్ ​బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్

నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అధికారులు షాక్​ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసి రూ.70 కోట్ల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు.  33,328 టన్నుల ధాన్యానికి లెక్కలు లేవని పౌర సరఫరాల శాఖ నిర్ధారించింది. ఇదంతా 2021–---22 యాసంగి, 2022--–23 వానాకాలం సీజన్లకు సంబంధించినదిగా ఐటెండిఫై చేశారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు.  

నిజామాబాద్​జిల్లాలోని మూడు మిల్లుల్లో ఈ ధాన్యం దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరిన్ని తనిఖీలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని సివిల్​సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, ఇటీవల ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి రూ.45 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.