బిగ్ టెక్ కంపెనీల్లో నియామకాల జోరు.. 2026లో గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు ఎంత మందిని తీసుకున్నాయంటే..

బిగ్ టెక్ కంపెనీల్లో నియామకాల జోరు..  2026లో గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు ఎంత మందిని తీసుకున్నాయంటే..

న్యూఢిల్లీ: మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్, గూగుల్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఏఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ) లతో కూడిన అంతర్జాతీయ ‘బిగ్ టెక్’ సంస్థలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 13,600 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకున్నాయి. నియామక సంస్థ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెనో’ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది ఇదే కాలంతో (12,800 నియామకాలు) పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కంపెనీలు నియామకాలు జరుపుతున్నాయి.  మెటా గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 10శాతం సిబ్బందిని తగ్గించినప్పటికీ, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన అనుబంధ సంస్థలతో కలిపి ఈ ఏడాది 1,600 మందిని తీసుకుంది.

యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిపాదిత 'హైర్ యాక్ట్' ( 25శాతం అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ పన్ను) ,  పెరిగిన వీసా ఖర్చుల వల్ల అమెరికా కంపెనీలు అక్కడ నియామకాలను తగ్గించి, డీప్-టెక్ ప్రాజెక్టులను భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లిస్తున్నాయి.  ప్రస్తుతం జనరేటివ్ ఏఐ  ఇంజనీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్స్, డేటా ఇంజనీరింగ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ 25-–30శాతం పెరిగింది.

బ్యాకెండ్ డెవలపర్, ఐటీ ఆప్స్ వంటి సాధారణ ఉద్యోగాల నియామకాలు తగ్గుముఖం పట్టాయి. కన్సల్టెన్సీ కంపెనీ  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్ డిజిటల్ అంచనా ప్రకారం, 2026 చివరి నాటికి బిగ్ టెక్ నియామకాలు 2025తో పోలిస్తే 16-–20 శాతం పెరగొచ్చు.