బిగ్ బాస్ రివ్యూ: కొందరు హిట్.. కొందరు ఫట్

బిగ్ బాస్ రివ్యూ:  కొందరు హిట్.. కొందరు ఫట్

నామినేషన్ ప్రక్రియ ముగిశాక అందరూ దాని గురించే చర్చిస్తారు. జరిగినవాటిని పదే పదే తవ్వుకుంటూ ఉంటారు. కొందరు రగిలిపోతుంటారు. కొందరు మౌనంగా మిగిలిపోతుంటారు. ఇవాళ కూడా ఎపిసోడ్ అలాగే మొదలైంది. ఇంతకీ ఎవరు ఏం మాట్లాడుకున్నారు? బిగ్‌బాస్ ఏం కొత్త టాస్క్ ఇచ్చాడు? దాన్ని హౌస్‌మేట్స్ ఎలా పర్‌‌ఫార్మ్ చేశారు?

ఆది ఆపలా.. వాసంతి వదల్లా!

రివ్యూలు చేయడం ఆదిరెడ్డి ఆపట్లా. బాధపడుతున్న బాలాదిత్యని ఓదార్చే క్రమంలో అతని ఆటతీరుని, మిగతావారి మాటతీరుని అనలైజ్ చేయడం మొదలెట్టాడు. నీ తప్పేమీ లేదు, నువ్వు తప్పు చేయకపోవడమే తప్పు, నువ్వు అలా ఊరుకోకుండా ఉండాల్సింది, గీతూ నిన్ను అలా అన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదేంటి అంటూ తెగ మోటివేట్ చేశాడు. ఇక వాసంతి తన గురించి ఆదిరెడ్డి కామెంట్స్ విషయమై అర్జున్‌ దగ్గర బాధపడింది. ప్రతిసారీ అతను నేను డిజర్వ్ కాదు అనడం తప్పు అంది. ఇక కీర్తి తన బాధని సూర్యతో వంటింట్లో వెళ్లబోసుకుంది. ఏదో రీజన్ చెప్తుంది అనుకుంటే చమ్కీ అంటూ మొదలెట్టిందేంటి అంటూ ఇనయా గురించి శ్రీహాన్ టీమ్ డిస్కస్ చేసుకుంది. ఆదిరెడ్డితో అనవసరంగా పెట్టుకున్నానని సత్య దగ్గర అర్జున్ మొరపెట్టుకున్నాడు. నిన్ను అననప్పుడు నీకెందుకు మధ్యలో అంటూ సత్య అతనికి క్లాస్ పీకింది. నైట్ పడుకునేటప్పుడు వాసంతి, అర్జున్‌ల ఫీలింగ్స్‌ గురించి రేవంత్ పంచాయతీ పెట్టాడు. ఆ తర్వాతి రోజు కూడా వాసంతి, అర్జున్‌ల గురించి మాట్లాడుకుని రేవంత్, శ్రీహాన్ ఫుల్లుగా నవ్వుకున్నారు. అర్జున్‌ని కూడా ఆట పట్టించారు. 

చేసినోడికి చేసినంత!

కెప్టెన్సీ కుర్చీ కోసం ఎవరు పోటీపడాలో నిర్ణయించేందుకు గాను ఈ వారం ఓ ఎంటర్‌‌టైనింగ్ టాస్కును ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్ అందరినీ రెండు టీములుగా విభజించాడు. టాలీవుడ్ ఫ్యాంటసీస్, టాలీవుడ్ డైనమైట్స్ అని పేర్లు పెట్టాడు. అందరికీ హిట్ సినిమాల్లోని ప్రముఖ పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రల్లా బిహేవ్ చేస్తూ సమయానుసారం ఇచ్చిన చాలెంజెస్‌ని ఫేస్ చేయాలి. టైమ్ ముగిసేసరికి ఎక్కువ చాలెంజెస్ గెలిచిన టీమ్‌ సభ్యులు కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారు. టాలీవుడ్ ఫ్యాంటసీస్‌ టీమ్‌లో రేవంత్‌.. ఘరానామొగుడులో చిరంజీవిలా, బాలాదిత్య.. భీమ్లానాయక్‌లా, శ్రీహాన్.. చెన్నకేశవరెడ్డిలో బాలకృష్ణలా, ఆదిరెడ్డి.. కూలీ నంబర్ 1లో వెంకటేష్‌లా, కీర్తి.. ఒసేయ్ రాములమ్మలో విజయశాంతిలా, ఫైమా.. నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా, ఇనయా.. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిలా చేయాల్సి ఉంటుంది. ఇక టాలీవుడ్ డైనమైట్స్ టీమ్‌లో అర్జున్.. టెంపర్‌‌లో ఎన్టీఆర్‌‌లా, సూర్య... పుష్పలో అల్లు అర్జున్‌లా.. రోహిత్.. మగధీరలో రామ్‌ చరణ్‌లా, రాజ్.. ఛత్రపతిలో ప్రభాస్లా, శ్రీసత్య.. ఫిదాలో సాయిపల్లవిలా, గీతూ.. పుష్పలో రష్మికలా, మెరీనా.. అరుంధతిలో అనుష్కలా, వాసంతి.. బొమ్మరిల్లులో జెనీలియాలా కనిపించాల్సి ఉంటుంది. అందరికీ ఆయా పాత్రలకి సంబంధించిన కాస్ట్యూమ్స్ పంపించాడు బిగ్‌బాస్.

కొత్త గెటప్.. సూర్య సెటప్

ఇలా పుష్పరాజ్ గెటప్ వేశాడో లేదో.. టాస్క్ ఆడటానికి రెడీ అయిపోయాడు సూర్య. అందరితోటీ అలా ఆడదాం ఇలా ఆడదాం అని డిస్కషన్ కూడా మొదలుపెట్టాడు. నేను పుష్ప, నువ్వు శ్రీవల్లి కాబట్టి నేను ఫుడ్ అదీ దొంగతనం చేసి నీకు సీక్రెట్‌గా పెట్టొచ్చు అంటూ గీతూకి బిస్కెట్ వేశాడు. ఆ తర్వాత వాసంతి దగ్గర కూర్చుని మనం ఇలా ఆడదాం, మనమే సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకోవాలి అంటూ ఆమెకి గేమ్ వివరించాడు. నువ్వు హాసిని పాత్రలో ఉండి శ్రీవల్లికి హెల్ప్ చెయ్యి, మనం ఓ స్కిట్‌లా దీన్ని పర్‌‌ఫార్మ్ చేద్దాం అని ఓ సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మెరీనాకి, రోహిత్‌కి కూడా క్లాసులు తీసుకున్నాడు. ఏంటి ఇంత హంగామా చేస్తున్నాడు అనిపించింది కానీ.. అతను పుష్పరాజ్‌ పాత్ర చేస్తున్న తీరు మాత్రం మామూలుగా లేదు. బజర్ మోగగానే గీతూతో డైలాగ్స్ మొదలుపెట్టాడు. గీతూ కూడా శ్రీవల్లిలా మారిపోయి రివర్స్ డైలాగ్స్ కొట్టింది. అతిలోక సుందరిలా వచ్చిన ఇనయాని చూసి కాసేపు ఆట పట్టించాడు సూర్య. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి బాగా పర్‌‌ఫార్మ్ చేస్తున్నాడు. మిమిక్రీ కూడా బాగా చేయగలడు కాబట్టి బన్నీ వాయిస్‌ని దించేస్తున్నాడు. ఆదిరెడ్డిని కేశవ ప్లేస్‌లో పెట్టి చేసిన కామెడీ కూడా బాగా అనిపించింది. 

కొందరు హిట్.. కొందరు ఫట్

అన్నీ అందరూ చూసిన సినిమాలే కావడంతో పాత్రలను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. చెన్నకేశరెడ్డి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ తేడా వస్తే బాలయ్య ఫ్యాన్స్ ఆడుకుంటారంటూ శ్రీహాన్ నవ్వేశాడు. కానీ తర్వాత అదరగొట్టేశాడు. ఇక రాజ్ ఎప్పట్లాగే ఎలా ఆడాలి అని కన్‌ఫ్యూజ్ అవుతుంటే ప్రభాస్‌లా ఎలా యాక్ట్ చేయాలో రేవంత్ శిక్షణనిచ్చాడు. ఆ తర్వాత తన వంతు ప్రయత్నం చేస్తూ ఛత్రపతిలా చించేయాలని తపన పడసాగాడు రాజ్. బన్నీలా సూర్య, రష్మికలా గీతూ, బాలయ్యలా శ్రీహాన్, చిరంజీవిలా రేవంత్‌ ఓ రేంజ్‌లో పర్‌‌ఫార్మ్ చేస్తున్నారు. పాపం భీమ్లాలా కనిపించడానికి బాలాదిత్య ట్రై చేస్తున్నాడు కానీ వర్కవుట్ కావట్లేదు. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైమా కూడా నీలాంబరి పాత్రకి న్యాయం చేస్తోంది. రాములమ్మలాంటి పవర్‌‌ఫుల్ పాత్రనిస్తే ఆ పవర్‌‌ని వదిలేసి బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్న రాములమ్మలా కన్నీళ్లు ఒలికిస్తోంది కీర్తి. అయితే తన వరకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తోందనే చెప్పాలి. ఇక కూల్‌గా ఉండే రోహిత్‌కి మగధీర లాంటి వీరుడి పాత్ర ఇవ్వడంతో కాస్త కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. అరుంధతి పాత్రలో బెస్ట్ ఇవ్వడానికి మెరీనా ఆరాటపడుతోంది కానీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అతిలోక సుందరిలా చేయమంటే క్యూట్‌ మూమెంట్స్ చేయాల్సింది పోయి అదో రకం యాక్షన్‌తో పేషెన్స్ని పరీక్షిస్తోంది ఇనయా. అయితే ఆమెతో చమ్కీల టాపిక్ తెచ్చి బాలయ్య స్టైల్లో శ్రీహాన్ ఎంటర్‌‌టైన్ చేసిన తీరు మాత్రం వారేవా అనిపించింది. ఇక వాసంతి హహ హాసిని అనే డైలాగ్‌ తప్ప మరో డైలాగ్ చెప్పకుండా టైమ్ పాస్ చేస్తోంది. ఆదిరెడ్డికి అయితే అసలేం చేయాలో కూడా అర్థమే కాకుండా ఉంది. పైగా ఇలా పర్‌‌ఫార్మెన్స్ టాస్కులు ఇస్తుంటే బిగ్‌బాస్ ఫ్లేవర్ మిస్సవుతున్నట్టు అనిపిస్తోంది గీతూ అంటున్నాడు. ఎవరు ఎలా ఆడితే నాకేంటని అర్జున్ మాత్రం సత్య, వాసంతిల చుట్టూనే తిరుగుతున్నాడు.  

అర్జున్ పప్పు.. రేవంత్‌దే తప్పు

కాసేపు అందరూ పర్‌‌ఫార్మ్ చేసిన తర్వాత మొదటి చాలెంజ్ పెట్టాడు బిగ్‌బాస్. రెండు టీముల నుంచి ఇద్దరిద్దర్ని ఎంచుకోవాలి. గార్డెన్ ఏరియాలో పోస్టర్లు, ఖాళీ వాల్ ఉంటాయి. ఆ ఇద్దరూ ఎవరి పోస్టర్లను వాళ్లు తీసుకెళ్లి ఆ వాల్‌కి అతికించాలి. టైమ్ ముగిసేసరికి ఎవరి పోస్టర్లు వాల్‌పైన ఎక్కువ ఉంటాయో ఆ టీమ్ గెలుస్తుంది. ఇదే చాలెంజ్. ఈ ఆటలో చివరికి ఫ్యాంటసీస్ టీమ్ చాలెంజ్ గెలిచింది. అయితే ఈ ప్రాసెస్‌లో రేవంత్‌కి, అర్జున్‌కి మధ్య గొడవ మొదలైంది. అర్జున్ ఏదో మాట్లాడుతుంటే తనని పప్పు అంటూ రేవంత్ కామెంట్ చేయడంతో అర్జున్ చాలా సీరియస్ అయ్యాడు. అందరికీ పేర్లు పెడుతున్నావేంటి, ఈ అలవాటు మానుకో అంటూ ఫైర్ అయ్యాడు. రేవంత్ తగ్గే టైప్ కాదు కాబట్టి రివర్స్ అయ్యాడు. మధ్యలో సత్య దూరి అర్జున్‌కి సపోర్ట్ చేయడంతో అతనికి మరింత కోపం వచ్చింది. తనదైన స్టైల్లో వాదనకు దిగాడు. దాంతో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఫ్రెండ్‌వని ఓపిక పడుతున్నాను అని అర్జున్ అంటే నేనసలు నీ ఫ్రెండునే కాదు, నాకు నీ ఫ్రెండ్‌షిప్ అక్కర్లేదు అని తేల్చి చెప్పేశాడు రేవంత్. గతంలోనూ వీరి మధ్య ఇలాగే గొడవ జరిగింది. మళ్లీ కొన్నాళ్లకు కలిశారు. ఈసారి ఎన్నాళ్లకు కలుస్తారో చూడాలి మరి.

హౌస్‌మేట్స్‌ వీక్.. బిగ్‌బాస్ ఇచ్చాడు షాక్

చాలెంజ్ ముగిశాక అందరూ తమ తమ డిస్కషన్స్లో ఉంటే సడెన్‌గా బిగ్‌బాస్ వాయిస్ వినిపించింది. దాంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి వరుసగా నిలబడమనడంతో అక్కడికి పరిగెత్తారు. మరో చాలెంజ్ ఇస్తాడేమో అని చూస్తున్న కంటెస్టెంట్లకి ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ చరిత్రలో ఎంతో పెద్ద హిట్టయిన టాస్క్ ఇస్తే.. ఏ సీజన్‌లోనూ లేనంత నిరాశాజనకంగా దాన్ని మార్చేశారంటూ మండిపడ్డాడు. దీనికి కారణం మీ నిర్లక్ష్యమే అన్నాడు. టాస్కుల పట్ల, బిగ్‌బాస్ నియమాల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారని, టాస్కులో ఉన్నంతసేపు తమ పాత్రల్లోనే ఉండాలన్న కనీస నియమాన్ని కూడా ఉల్లంఘించారని సీరియస్ అయ్యాడు. ఫైమా, సూర్య, గీతూ, రేవంత్, శ్రీహాన్, రాజ్ మాత్రమే తమ పాత్రల్లో ఉన్నారని.. బాలాదిత్య, కీర్తి కొంతవరకు ప్రయత్నిస్తున్నారని.. రోహిత్ మ్యాగ్జిమమ్ ట్రై చేసినా కాస్ట్యూమ్‌ని చాలాసార్లు వదిలేశాడని.. ఇక మిగతావారంతా స్వేచ్ఛగా పాత్రల్లో ఉండటానికి, ఎంటర్‌‌టైన్ చేయడానికి పూర్తి నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారని చెప్పిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ని ఇంతటితో రద్దు చేసేస్తున్నాను అని ప్రకటించాడు. ఈవారం బిగ్‌బాస్ ఇంటికి కెప్టెన్ ఉండరు అని తేల్చేశాడు. బిగ్‌బాస్ పట్ల, మిమ్మల్ని ఆతృతగా చూడాలనుకునే ప్రేక్షకుల పట్ల, షో పట్ల మీకు ఆసక్తి లేకపోతే తక్షణమే బైటికి పొండి అంటూ గేటు కూడా తెరిచాడు. దాంతో అందరూ అవాక్కయిపోయారు. బాగా ఆడతామని, టాస్క్ రద్దు చేయొద్దని అందరూ బతిమిలాడారు. బన్నీలా సూర్య, చిరంజీవిలా రేవంత్, బాలయ్యలా శ్రీహాన్‌, ప్రభాస్‌లా రాజ్‌, శ్రీవల్లిలా గీతూ మాట్లాడుతూ బాగా ఆడతామని ప్రామిస్ చేశారు. మిగతావాళ్లంతా చాలాసార్లు సారీ చెప్పారు. అయినా బిగ్‌బాస్ కరగలేదు. కాస్ట్యూమ్స్‌ తీసి స్టోర్ రూమ్‌లో పెట్టమన్నాడు. 

ఇది నిజంగా మామూలు షాక్ కాదు. బిగ్‌బాస్ అంత సీరియస్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆయన కోప్పడి మంచి పనే చేశాడు. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్లు ఆటని చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. అందుకే ప్రతి సీజన్‌లా ఈ సీజన్ హిట్ కాలేదు. ఎంటర్‌‌టైనింగ్‌గానూ లేదు. అందుకే ఇలా ఓ షాక్ ఇవ్వడం మంచిదే. అయితే దీనివల్ల మొదట్నుంచీ అద్భుతంగా పర్‌‌ఫార్మ్ చేస్తున్న శ్రీహాన్ బాగా హర్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ అంటే ఏంటో చాలామందికి తెలియడం లేదు, కేవలం ఫిజికల్ టాస్కులే అనుకుంటున్నారు, మీరైనా కాస్త వాళ్లకి చెప్పండి అని బిగ్‌బాస్‌తో అన్నాడు. అవకాశం కావాలి అని ఆరాటపడతారు, వచ్చాక ఇలా చేస్తారు అంటూ చిరాకుపడ్డాడు. అతని ప్రతి మాటా వాస్తవమే. ఇప్పటికైనా కొందరు హౌస్‌మేట్స్ తీరు మారకపోతే ఆట ముందుకెళ్లడం కష్టమే. మరి వాళ్లు ఇప్పటికైనా మారితే పర్లేదు. లేదంటే వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున దగ్గర దోషుల్లా నిలబడాల్సిందే. అక్షింతలు వేయించుకోవాల్సిందే