Bigg Boss 19 : 'బిగ్ బాస్ 19' హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ రీఎంట్రీ.. ఈసారి టూ మచ్ ఫన్ పక్కా!

Bigg Boss 19 :  'బిగ్ బాస్ 19' హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ రీఎంట్రీ.. ఈసారి టూ మచ్ ఫన్ పక్కా!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan )  మరో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.  ఇండియాలో 'బిగ్ బాస్' రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ రియాలిటీ షో ' బిగ్ బాస్ 19' వ సీజన్ కు హోస్ట్ గా తాను వ్యవహరిస్తున్నట్లు అధికారంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్‌కు, సల్మాన్ ఖాన్‌కు మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఆయన హోస్టింగ్ శైలి, కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాయి.

ఈ సందర్భంగా సల్మాన్ తనదైన శైలితో కూడిన రియాలిటీ షో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. "నేను బిగ్ బాస్ కొత్త సీజన్‌తో తిరిగి వచ్చేశాను..  ఈసారి నడిచేది - ఘర్‌వాలోం కీ సర్కార్ అంటూ  సల్మాన్ ఖాన్ ప్రకటన చేశారు. ఆయన చేసిన  ప్రకటన ఈ సీజన్ థీమ్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన వీడియోలో సల్మాన్, ఈసారి వినోదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని, "టూ మచ్ ఫన్" గ్యారంటీ అని హామీ ఇచ్చారు. ఈ ఉత్కంఠభరితమైన సీజన్ ఆగస్టు 24 నుంచి 'కలర్స్‌టీవీ'లో రాత్రి 10.30 గంటలకు ప్రసారం కానుంది. 'జియోహాట్‌స్టార్'‌లో 9 గంటల నుంచి  స్ట్రీమింగ్ అవ్వనుంది. 

రతీ పాండే, అపూర్వ ముఖిజా, మిస్టర్ ఫైసు, ధనశ్రీ వర్మ, శ్రీరామ చంద్ర, మీరా దేవస్థలే, భావికా శర్మలు,  బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ఉండే అవకాశం ఉంది. అయితే  వీరి పేర్లు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరో వైపు బిగ్ బాస్ 19 పోటీదారుల అధికారిక జాబితాను షో నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించడం ఇది 16వ సారి కావడం విశేషం. ప్రతి ఏటా షో ప్రారంభానికి ముందు సల్మాన్ హోస్టింగ్ చేస్తారా లేదా అనే దానిపై ఊహాగానాలు రావడం, చివరికి ఆయనే వస్తున్నట్లు ప్రకటించడం అభిమానులకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. కాగా, ఈ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్ స్థానంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) సీజన్ 17కు సల్మాన్ హోస్ట్‌గా వస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఆ వదంతుల్లో నిజం లేదని, KBCకి అమితాబ్ బచ్చనే తిరిగి వస్తున్నారని స్పష్టం కావడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.

 

క సల్మాన్ ఖాన్ సినిమా కెరీర్ విషయానికొస్తే, ఆయన చివరిసారిగా ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సికందర్' చిత్రంలో రష్మిక మందన్న సరసన కనిపించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ప్రముఖ 'బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్' చిత్ర దర్శకులు బిలాల్ ఫల్లా, ఆదిల్ ఎల్ అర్బీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సౌదీ అరేబియన్ చిత్రం '7 డాగ్స్'లో సంజయ్ దత్‌తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నారు.   మొత్తంమీద, ఒకవైపు బిగ్ బాస్ 19 హోస్ట్‌గా, మరోవైపు అంతర్జాతీయ సినిమాతో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 'ఘర్‌వాలోం కీ సర్కార్' థీమ్‌తో రాబోతున్న కొత్త సీజన్‌లో కంటెస్టెంట్లు ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.