
బిగ్‌బాస్ సీజన్7(Bigg boss season7) టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్(Rathika rose). అలాగే తన ఆటతో ఆడియన్స్ మనసు దోచుకునే ప్రయత్నం చేసింది. తన అవసరం ఉన్న చోట గట్టిగా మాట్లాడింది. తన అనుకున్న వాళ్ళ కోసం కూడా నిలబడింది కానీ.. తన చుట్టూ ఎం జరుగుతుందో పసిగట్టలేకపోయింది. దీంతో అనుకోని విధంగా నాలుగో వారంలో ఆమె ఇంటినుండి ఎలిమినేట్ అయ్యింది. కారణాలు ఏవైనా.. ఇంత తొందరగా బయటకు వచ్చేస్తానని ఆమె కూడా ఊహించలేకపోయింది. ముందు పల్లవి ప్రశాంత్‌తో ఫ్రెండ్ షిప్, తరువాత విబేదాలు రావడం ఇవి ఆమెకు మైనస్ గా మారాయి.
అయితే తాజాగా రతిక పేరెంట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు రతిక గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆమె తండ్రి రాములు మాట్లాడుతూ.. మాది తెలంగాణలోని తాండూర్‌కు చెందిన రైతు కుటుంబం. రతిక అసలు పేరు ప్రియ.. ఆమె కోరికమేరకు ప్రస్తుతం మేము హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. రతిక చిన్నమ్మాయి. కేవలం రతిక వల్ల ఈ రోజు మా జీవితం ఆనందంగా కొనసాగుతోంది. ఒకప్పుడు కనీసం రతిక స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉండేవాళ్ళం. నవోదయ పాఠశాల్లో సీటు రావడంతో ఆమెను చదివించగలిగాను. రతిక చదవులో మెరిట్.. అందుకే మంత్రి మల్లారెడ్డి ఉచితంగా ఆయన కాలేజీలో ఇంజనీరింగ్ చదివించారు.
రతికది చిన్నపిల్ల మనస్థత్వం. ఇంట్లో ఎలా ఉంటుందో.. బిగ్‌బాస్‌లో కూడా అలాగే ఉంది. ఆమెపై కావాలనే కొందరు ప్రేమ పేరుతో పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. ఆమె ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు చేయడానికి ఒక తండ్రిగా సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాములు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.