బిగ్ బాస్ 7.. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌ వీళ్లే..

బిగ్ బాస్ 7.. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌ వీళ్లే..

బిగ్గెస్ట్ రియాలిటీ షో  బిగ్ బాస్ తెలుగు సీజన్  7 స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 రెగ్యులర్ మోడల్ లో కాకుండా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో నడిపిస్తున్నారు.  హోస్ట్ కింగ్ నాగార్జున  ఒక్కొక్క కంటెస్ట్ ను హౌస్ లోకి ఇన్వయిట్ చేస్తున్నారు. 


తొలి కంటెస్ట్ గా జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ ను  నాగార్జున ఇన్వయిట్ చేశారు. రెండో కంటెస్ట్ గా హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లారు.  మూడో కంటెస్ట్ గా సింగర్  దామిని ఎంటరయ్యింది. నాల్గో కంటెస్ట్ గా  మోడల్ ప్రిన్స్ యావర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐదో కంటెస్ట్ గా  యాక్టర్ కమ్ లాయర్ శుభశ్రీ ఎంట్రీ ఇచ్చింది. 

 ఆరో కంటెస్ట్ గా  నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది.  ఏడవ కంటెస్ట్ గా  కొరియోగ్రాఫర్ ఆట షో సందీప్ ఎంట్రీ ఇచ్చాడు.  ఎనిమిదో కంటెస్ట్ గా శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది.  కార్తీక దీపం  మోనిత అంటే అందరూ గుర్తు పడతారు. తొమ్మిదో కంటెస్ట్ గా ఫుడ్ వీడియోలతో  యూట్యూబ్ లో  పాపులర్ అయిన టేస్టీ  తేజ్  బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  పదో కంటెస్ట్ గా నటి రతిక ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె..తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌస్ లోకి వచ్చానని చెప్పింది.