బిగ్​బాస్​ షో​ ఇకపై​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లో

బిగ్​బాస్​ షో​ ఇకపై​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లో

తెలుగు బిగ్​బాస్​ షో​ ఇకపై​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లో టెలికాస్ట్​ అవుతుందని ఐదో సీజన్​ హోస్ట్ నాగార్జున ఇప్పటికే చెప్పాడు. ఐదో సీజన్​ ఫినాలేని దాదాపు ఐదు కోట్ల మంది దాకా చూశారు.  ఓటీటీ కొత్త వేదికలో వచ్చే బిగ్​బాస్​ సీజన్​ కూడా తెలుగు ఆడియెన్స్​ని మరింత ఎంటర్​టైన్​ చేస్తుందనే  నమ్మకంతో ఉన్నాడాయన. ఓటీటీలో వచ్చే బిగ్​బాస్​ సీజన్​కి కూడా నాగార్జునే హోస్టింగ్​ చేస్తాడనేది టాక్​. బిగ్​బాస్ సీజన్​ ఓటీటీ వెర్షన్​ గురించి ఆడియెన్స్​తో పాటు ​ ఐదో సీజన్​ విన్నర్​ వీజే సన్నీ కూడా ఎదురు చూస్తున్నాడట. ‘‘బిగ్​బాస్​ తెలుగు ఓటీటీ అనేది గొప్ప అవకాశం. 

ఆ అవకాశాన్ని మిస్​ కావొద్దు. 
బిగ్​బాస్​ షో ఒక క్రేజీ వరల్డ్​. కంటెస్టెంట్​గా వెళ్లి ఆ ఫీలింగ్​ని ఎంజాయ్​ చేయండి” అన్నాడు సన్నీ. ‘బిగ్​బాస్​ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తారా? ’ 
అని అడిగితే, ‘ఎప్పుడైనా సరే... బిగ్​బాస్ హౌస్​లోకి సీనియర్​గా వెళ్లడానికి ఇష్టపడతా’ అని సరదాగా చెప్పాడు వీజే సన్నీ.