
బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) రాబోతుంది.'అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్ లిమిటెడ్..లిమిటే లేదు' అంటూ వచ్చేస్తోంది. అంటే ఈసారి లిమిటే లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్ కు హామీ ఇచ్చేశాడు.
తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు అని స్టార్ మా ఛానెల్ తెలిపింది. "ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్టులు, టర్న్స్ కి లిమిటే లేదు. లిమిట్‌లెస్ సీజన్ 8 కోసం సిద్ధంగా ఉన్నారా? గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తోంది" అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో కొత్త సీజన్ ప్రారంభం విషయాన్ని ప్రకటించింది.
Ee sari Bigg Boss lo entertainment, fun, twists & turns ki LIMIT EH LEDU! Are you ready for LIMITLESS season 8?! THE GRAND LAUNCH coming to you on September 1st at 7 pm! #StarMaa #BiggBossTelugu8 @DisneyPlusHSTel @iamnagarjuna pic.twitter.com/hHC5kOehUs
— Starmaa (@StarMaa) August 21, 2024
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించడం టీజర్తో కన్ఫమ్ కాగా.ఈసారి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ తెలుస్తోంది. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
Also Read :- ఇన్‌స్టాలో ప్రధాని మోడీని దాటేసిన స్టార్ హీరోయిన్
బిగ్ బాస్ (Bigg Boss)..ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి..వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ. ఇప్పటికే ఏడు సీజన్‌లు దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అప్డేట్ రావడంతో ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.