దట్స్ ఇండియా : బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ప్రయాణికులు

దట్స్ ఇండియా : బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ప్రయాణికులు

మన దేశంలో రైల్వే వ్యవస్థ ఎంతగానే అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద నగరాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నాయి. అలాగే ఎంతటి దూరాన్ని అయినా సరే వీలైనంత త్వరగా చేరుకునేలా వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా వచ్చాయి. అయితే రైల్వే వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అందులోని కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బస్సులు స్టార్టింగ్ ట్రబుల్ సమస్యలతో స్టార్ట్ కావు. అప్పుడు బస్సు సిబ్బందితోపాటు ప్రయణికులు బస్సును నెడుతుంటారు. ఆ తర్వాత అవి స్టార్ట్ అవుతాయి.  అయితే రైలును ప్రయాణికులు నెడుతున్న వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ గామారింది. 

ఓ రైలులో భారీ మంట‌లు చెల‌రేగిన ఘ‌ట‌న‌ బీహార్‌లో జ‌రిగింది. కియుల్ స్టేషన్లోని పాట్నా-జాసిదిహ్ మెములో అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఆగి ఉన్న రైల్లో మంట‌లు ఒక్కసారిగా చెల‌రేగాయి. . ద‌ట్టమైన పొగ‌లు క‌మ్ముకున్నాయి.  అన్ని బోగీల‌కు మంట‌లు వ్యాపించ‌కుండా  ప్రయణికులు రైలును నెడుతూ .. మంటలు వ్యాపించిన బోగీల నుండి వేరు చేశారు.  ఈ వీడియో సోషల్​ మీడియాలో 'బీహార్ ప్రారంభకులకు కాదు అనే టాగ్​ లైన్​ తో పోస్ట్​ చేశారు. 

బీహార్ లోని లఖిసరామ్లోని కియుల్ జంక్షన్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కియుల్ స్టేషన్లోని పాట్నా-జాసిదిహ్ మెములో చిన్నపాటి మంటలు చెలరేగాయి, మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ప్రయాణికులు రైలును కోచ్​ లనుండి నెడుతూ విడదీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం కాలేదు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.  పాట్నా నుంచి వస్తున్న రైలు కియాల్కు చేరుకున్నప్పుడు గురువారం ( జూన్​ 6)  సాయంత్రం 5.24 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.  అయితే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు గమనించారు.   అన్ని బోగీలకు అంటుకోకుండా.. ఇతర రైళ్లకు మంటలు వ్యాపించకుండా ప్రయాణికులు ట్రైన్​ ను చేతులతో బస్సును నెట్టినట్టు నెట్టారు.

ఈ ఘటన జరిగిన తరువాత అదే రోజు రాత్రి 7.45 గంటలకు రైళ్లను పునరుద్దరించినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) సరస్వతి చంద్ర తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియారాలేదు,  రైల్వేశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.