
బిల్‌గేట్స్ దేశ వీధుల్లో ఆటో వేసుకొని తిరిగారు. మహింద్రా తెచ్చిన ఎలక్ట్రిక్ ఆటో ట్రెయోను ఆయన నడిపారు. ‘ఇన్నోవేషన్స్‌లో ఇండియా ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. నేను 131 కి.మీ (81 మైళ్లు) వెళ్లే ఒక ఎలక్ట్రిక్ రిక్షాను డ్రైవ్ చేశా. ఇందులో నలుగురు ప్రయాణించొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ఇండస్ట్రీలో కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించడానికి మహీంద్రా వంటి కంపెనీలు ముందుకు రావడం ఇన్‌స్పైర్ చేస్తోంది’ అని బిల్‌గేట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఈసారి సచిన్, మీరు, నేను కలిసి త్రీవీలర్ రేసుకి వెళ్దాం’ అని ఆనంద మహీంద్రా సమాధానమిచ్చారు.