అతను అడవిని కొనేశాడు

అతను అడవిని కొనేశాడు

డబ్బులుంటాయి. ఆస్తులు, అంతస్తులు ఉంటాయి. పిల్లలు బతకడానికి తల్లిదండ్రులు సంపాదించి పెడతారు. ఆ ఆస్తులతో పిల్లలు బతకొచ్చు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ సమాజం బతకాలంటే.. తిండి, నీళ్లు.. బతకడానికి కనీస సౌకర్యాలు కావాలి.  ముఖ్యంగా పీల్చే గాలిని  రాబోయే తరాలకు అందించాలి. అవును..ముందు తరాలకు మనం అందించే ఆస్తి ఆక్సిజనే. అది అందరికీ అందిచినప్పుడే మనిషి మనుగడ. అలాంటి ఆక్సిజన్​ను అందించే అడవుల్ని కాపాడాలి. అందుకే, స్వీడన్​కు చెందిన జోహన్ ఎలియాష్ అమెజాన్​ అడవుల్లో కొంత భాగాన్ని కొనుక్కున్న ఆ బిలియనీర్​ గురించి..

‘సార్​.. మీరు ఆ అడవిలోకి కారు​ కూడా తీసుకెళ్లలేరు’ అన్నాడు సెక్రెటరీ స్టాక్​రూమ్​లో ఉన్న జోహన్​తో... 
‘ఫర్వాలేదు.. నాకూ అలాగే కావాలి. ఇప్పుడు ఆ ఫారెస్ట్​ ఎవరి అధీనంలో ఉంది. ఆ వివరాలు చెప్పగలవా?’ ​ అడిగాడు జోహన్. 
 ఆ వివరాలు చెప్పాడు సెక్రెటరీ. 
జోహన్​ దగ్గర ఆ సెక్రెటరీ మొదట్నించీ ఉన్నాడు. అందుకే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. జోహన్​ పర్సనల్​ విషయాల్లో కలగజేసుకునే చనువు కూడా సెక్రెటరీకీ ఉంది. అందుకే చాలా సందర్భాల్లో క్లోజ్​గా మాట్లాడుకుంటారు. అలాంటి టైంలోనే అమెజాన్​ ఫారెస్ట్​  కొనే విషయం గురించి ప్రపోజల్స్​ వచ్చాయి. వాటికి జోహన్​ రెస్పాండ్​ అయ్యాడు. 
‘ఈ రెయిన్​ ఫారెస్ట్​లో నేను నాలుగు లక్షల ఎకరాలను కొనాలని నిర్ణయించుకున్నాను’ చెప్పాడు ​ సెక్రెటరీతో జోహన్.
‘సార్​.. అంత పెద్ద ఫారెస్ట్​ కొనడం దేనికి? కొంపదీసి చెట్లన్నీ నరికేసి గోల్ఫ్​ కోర్స్​ కడతారా ఏంటి?’ సరదాగా అన్నాడు సెక్రెటరీ.
‘కాదు’ అన్నాడు జోహన్​. 
‘సార్​.. మనం ఏమైన కొత్తగా కలప వ్యాపారం చేయబోతున్నామా? అది అనుకున్నంత ఈజీ కాదు’ అన్నాడు సెక్రెటరీ. 
‘ముందు.. ఆ నాలుగు లక్షల ఎకరాల ఫారెస్ట్​కు ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలవా?’ అని అడిగాడు జోహన్​. 
‘14 కోట్ల డాలర్ల పైనే అవుతుంది’.. చెప్పాడు సెక్రెటరీ. 
‘రూల్స్​, ఫార్మాలిటీస్​ అన్నీ కంప్లీట్​ చేయండి. ఫారెస్ట్​ ఏ కంపెనీ కింద ఉందో ఆ కంపెనీతో మాట్లాడండి. నేను వెంటనే దాన్ని కొనాలి’ అన్నాడు జోహన్​. 
‘సార్​.. అది మీరు కొనుక్కున్నా కూడా ఆ రెయిన్​ ఫారెస్ట్​ ఏరియాలో 9‌‌0 లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వాళ్లంతా పేదవాళ్లే. అందరూ బ్రెజిలియన్లు. మీరు దాన్ని కొన్నతర్వాత అందరినీ  అక్కడి నుంచి పంపేయాలా?’ అని సందేహంగా అడిగాడు సెక్రెటరీ. 
‘వాళ్లందరినీ అక్కడే ఉండనీ... నేను ఈ రెయిన్​ ఫారెస్ట్​ను కొనాలనుకుంటున్నది ఆస్తులను పెంచుకోవడం కోసం కాదు. అడవిని, జంతువులను, పక్షులను కాపాడటానికి’ అన్నాడు జోహన్​. 
‘ఏంటి? అడవిని కాపాడేందుకా?’ ఆశ్చర్యంగా చూశాడు సెక్రెటరీ. ‘ సార్​ ఇప్పటికే మీరు కన్జర్వేటివ్​ గ్రూప్స్​కు కోట్ల విరాళాలు ఇస్తున్నారు. పైగా ఎన్నో ఎన్విరాన్​మెంట్​ సంస్థలకు లోన్లు ఇస్తున్నారు. మళ్లీ కొత్తగా ఇది.. నాకేమీ అర్థం కావడం లేదు’ ఆశ్చర్యపోయాడు సెక్రెటరీ. 
‘అవును.. నిజమే.. కానీ, గ్లోబల్​ వార్మింగ్​ను తగ్గించి, వాతావరణాన్ని కాపాడటానికి నా వంతుగా ఈ పని చేయాలి అనుకుంటున్నాను’ ఇదే ఫైనల్​ డిసిషన్​ అన్నట్టు చెప్పి స్టాక్​ రూమ్​ నుంచి వెళ్లిపోయాడు జోహన్​. 

తర్వాత కొద్ది రోజుల్లోనే అమెజాన్​ రెయిన్​ ఫారెస్ట్​లో నాలుగు లక్షల ఎకరాలను జోహన్​ కొన్నాడు. కానీ దానికి ఎంత ఖర్చు చేశాడన్న సంగతి మాత్రం ఆయన ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అయితే ఇంటర్నేషనల్​​ ప్రతికలు మాత్రం దాని విలువ 8 మిలియన్​ డాలర్లు అయి ఉంటుందని చెప్పాయి. ఇప్పుడు అయితే దాని విలువ 11 మిలియన్​ డాలర్ల పైమాటే. స్వీడన్​లోని స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ కంపెనీ హెడ్‌ జోహన్ ఎలియాష్. మొదటి నుంచి పర్యావరణం మీద ఎక్కువ ఫోకస్​ చేసేవాడాయన. గ్లోబల్​ వార్మింగ్​ గురించి, అడవుల అవసరం గురించి ఎప్పుడూ రీసెర్చ్​ చేసేవాడు. అందుకే అనేక రకాల ఎన్విరాన్​మెంట్​ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎన్జీవో విరాళాలు, కంపెనీలకు లోన్లు ఇచ్చి ప్రోత్సహించేవాడు.

ఇటు బిజినెస్​ మ్యాన్​గా, ఎన్విరాన్​మెంట్​ యాక్టివిస్ట్​గా కార్పొరేట్​ రంగంలో జోహన్​కు పెట్టింది పేరు. 1962లో స్వీడన్​లో పుట్టిన ఆయన 1985లో ప్రైవేట్​ కంపెనీలను స్థాపించాడు. 1995లో లండన్​ స్పోర్టింగ్​ గూడ్స్​ కంపెనీకి అధిపతి అయ్యాడు. లండన్​ సండే టైమ్స్ ‘రిచ్ లిస్ట్’లో ఆయన నెంబర్​ 145. ఆయన ఆస్తి మొత్తం 355 మిలియన్ల డాలర్లు. వారసత్వ ఆస్తి ఉన్నప్పటికీ జోహన్​ సొంత ఆస్తులను  సంపాదించుకున్నాడు. 2005లో  రెయిన్​ ఫారెస్ట్​ ట్రస్ట్​ను స్థాపించాడు. దాని ద్వారా.. అమెజాన్​ రెయిన్‌ఫారెస్ట్‌ లో భాగాన్ని కొన్నాడు. అందులోని జీవులను రక్షించి, పెరుగుతున్న అడవులను కాపాడేందుకు వాతావరణంలో కార్బన్​ డై ఆక్సైడ్​ను తగ్గించేందుకు  తన వంతు కృషి చేస్తున్నాడు. 2006లో ‘కూల్​ ఎర్త్​’ చారిటీకి కో–ఫౌండర్​గా బాధ్యతలు చేపట్టాడు. ఈ చారిటీలో లక్షా ఇరవై వేల మంది సభ్యులున్నారు. దీని ద్వారా అక్కడ ఉండే ఎన్విరాన్​మెంట్​ ఎన్జీవోలకు అవసరమైన సాయం​ అందిస్తున్నారు. జోహన్​ చాలా కాలంగా పర్యావరణ సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు. ఇటీవల జరిగిన కాప్​20 సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న క్లైమేట్​ క్రైసిస్​ అనే సబ్జెక్ట్‌ గురించి మాట్లాడారు. అమెజాన్​ అడవుల ప్రాధాన్యం గురించి చర్చించారు కూడా.