లెక్చరర్లలో బయోమెట్రిక్ భయం

లెక్చరర్లలో బయోమెట్రిక్ భయం

డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొనసాగుతున్న బయోమెట్రిక్ అటెండెన్స్ 
 ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వస్తదేమోనని సిబ్బంది ఆందోళన 
కాలేజీల్లో కేసులు పెరుగుతున్నా వెనక్కి తగ్గని హయ్యర్ ఎడ్యుకేషన్  

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మాత్రం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తున్నారు. కాలేజీల్లో కేసులు నమోదవుతున్నా పట్టించుకుంటలేరు. బయోమెట్రిక్ అటెండెన్స్ వల్ల ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ సోకుతుందని లెక్చరర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాలేజీలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆన్ లైన్ క్లాసులే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇవ్వాలని, లేదంటే సెలవులైనా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 
కేంద్రం వద్దన్నా..
రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో 4 వేల మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరి అటెండెన్స్ బయోమెట్రిక్ విధానంలో కొనసాగుతోంది. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయొద్దని రాష్ర్టాలకు కేంద్రం గతంలోనే సూచించింది. వివిధ శాఖల్లో ఈ విధానం తీసేసినా హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో కొనసాగిస్తున్నారు.  
కాలేజీల్లో కరోనా కేసులు
రాష్ట్రంలోని కొన్ని చోట్ల లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో సుమారు 20 మందికి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకింది. ఖమ్మం డిగ్రీ కాలేజీలో 8 మందికి.. గజ్వేల్, సిద్దిపేటలో కొంతమందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తేయాలని సంఘాల నేతలు కోరినా ఫలితం లేకుండా పోయింది. బయోమెట్రిక్ ద్వారానే సిటీ కాలేజీలో సిబ్బందికి కరోనా వచ్చిందని, వారి నుంచి కుటుంబీకులకూ అంటిందని లెక్చరర్లు చెబుతున్నారు. 
సెలవులపైనా స్పష్టత లేదు 
స్కూల్, ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం.. డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కాలేజీలకు ఇంకా ఇవ్వలేదు. దీంతో లెక్చరర్లు భయంభయంగానే కాలేజీలకు వెళ్తున్నారు. ఈ నెల19 నుంచి డిగ్రీ స్టూడెంట్లకు 2, 4, 6వ సెమిస్టర్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీలూ మూడు వారాల క్రితమే ప్రస్తుత సెమిస్టర్ స్టూడెంట్లందరినీ ప్రమోట్ చేసి తర్వాతి సెమిస్టర్ క్లాసులు స్టార్ట్ చేశాయి. అయితే లెక్చరర్లు కాలేజీల నుంచే ఆన్​లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. కేసులు భారీగా పెరుగుతుండటంతో సెలవులైనా ఇవ్వాలని, లేదంటే వర్క్​ ఫ్రమ్​హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కై
నా అవకాశం ఇవ్వాలని లెక్చరర్లు కోరుతున్నారు.