చెరువులు,నదుల్లో ఉన్న చేపలను గద్దలు, కొంగలు ఎత్తుకెళ్లి తింటుంటాయి. అంతేకాదు చిన్నచిన్న కాలువల దగ్గర కూడా ఇలాంటివి మనకు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ పక్షి మాత్రం ఏకంగా సముద్రంలో నుంచి పెద్ద సొర చేపనే ఎత్తుకెళ్లింది. సొర చేపను ఎత్తుకెళ్లుతున్న దృష్యాన్ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఇది నిజమా…కలా అనుకున్నారు. కొందరు మాత్రం వెంటనే తమ కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగింది అమెరికాలోని దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌లో.
ఆ వీడియోని మొదటగా మిస్టర్ బర్బేజ్ అనే వ్యక్తి వీడియో తీసి దానిని ఫేస్‌బుక్ లో పోస్టు చేయగా, ఆ తర్వాత ట్రాకింగ్ షార్క్స్ సంస్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోను రీ పోస్ట్ చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా రెండు కోట్ల మంది చూశారు. అయితే సొరచేపను ఎత్తుకెళ్లిన పక్షి ఏంటని చాలామంది ట్రాకింగ్ షార్క్స్ ను ప్రశ్నించారు.
దీనితో ఎవరికి వారు తోచిన విధంగా సమాధానం చెప్పారు. అయితే చివరగా ఓ వ్యక్తి ఆ పక్షి పేరు ” ఓస్ ప్రే” అని తెలిపాడు. ఆ పక్షిని సముద్ర గద్దలని అని కూడా పిలుస్తారన్నాడు.
