బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్

బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తోడు దొంగలని.. ప్రజలంతా ఏకమై రెండు పార్టీలను తరిమి కొట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు  సుకుజిందర్ సింగ్ రంధవా కోరారు. సోమవారం ( సెప్టెంబర్ 18) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించిన సుకుజిందర్ సింగ్..తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు.పరిగి మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీ, సుల్తాన్ పూర్ లో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలపై ప్రజా చార్జీషీట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ALSO READ: అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలవుతాయని.. గ్యారంటీ కార్డులు పంపిణీ చేశారు. పంజాబ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో  అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని.. ఇంతపెద్ద ధనిక రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని సుకుజిందర్ సింగ్ ప్రశ్నించారు. కేసీఆర్ ముందు తన జేబు నింపుకున్నాకే ప్రజల గురించి ఆలోచిస్తాడని సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్ విమర్శించారు.