కేసీఆర్ ను నిజాం ఆవహించాడు

కేసీఆర్ ను నిజాం ఆవహించాడు

జనగామ: పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. తన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలను డైవర్ట్ చేసేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ను నిజాం ఆవహించాడని..నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని సీరియస్ అయ్యారు. మునావర్ ఫారుఖీని ఆహ్వానించి రెచ్చగొట్టిందెవరని ప్రశ్నించారు. కేసీఆర్ 8వ నిజాంను తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని.. వాటిని ప్రజలు తిప్పికొడతారని బండి సంజయ్ తెలిపారు. 

బండిసంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసులు పాదయాత్ర ఆపాలని నోటీసులివ్వండంపై హైకోర్టుకెళ్లి బీజేపీ నేతలు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో మూడు రోజుల బ్రేక్ తర్వాత యాత్ర కొనసాగనుంది. జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలైంది. ఉప్పుగల్, కూనూర్, గర్మెపల్లి, నాగపురం మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రేపు భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది సంజయ్ పాదయాత్ర. అమ్మవారి దర్శనం తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు . మరోవైపు ప్రజా సంగ్రామ పాదయాత్ర సందర్భంగా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.