
బీసీ మంత్రులు, నాయకులు సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు కూడా దాటలేని పరిస్థితి ఉందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్. బర్లు, గొర్ల వరకే బీసీలను పరిమితం చేశారని విమర్శించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నివాళులర్పించారు బండి సంజయ్. బడుగు బలహీన వర్గాల కోసం పూలే కృషి చేశారని చెప్పారు. రాష్ట్రంలో పూలే ఆశయాలకు వ్యతిరేకంగా పాలన జరుగుతోందన్నారు సంజయ్.