హుజురాబాద్‌లో  కాషాయ జెండా ఎగరడం ఖాయం

హుజురాబాద్‌లో  కాషాయ జెండా ఎగరడం ఖాయం

హుజురాబాద్లో  కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మొదటి విడత పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు సంజయ్. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ అయిన సందర్భంగా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పాదయాత్ర ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు బండి సంజయ్. 36 రోజుల పాటు.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగింది. 8 జిల్లాల్లోని 19 అసెంబ్లీ,  6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నడిచారు. నిన్న హుస్నాబాద్ లో తొలివిడత ప్రజాసంగ్రాయ యాత్ర ముగిసింది. ఇవాళ అమ్మవారికి పూజలు చేశారు సంజయ్.

తర్వాత హుజురాబాద్ కు చేరుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. జమ్మికుంటలో ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకొని ఎల్బీనగర్ నాగోల్ శుభం కన్వెన్షన్ సెంటర్లో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని నిర్విరామంగా పని చేసిన కార్యకర్తల సమావేశంలో  పాల్గొంటారు బండి సంజయ్.