
కేసీఆర్ ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. వరంగల్ ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారని అన్నారు. అప్పడు ఇదే కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను పొగిడిన మాట వాస్తవం కాదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యమంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఆర్టీసీ సమ్మె చైతన్య పరిచిందని .. ఇప్పుడు రాష్ట్ర వచ్చాక ఈ ఆర్టీసీ వాళ్లే దగా పడుతున్నారని అన్నారు. దీంతో పాటు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులవి న్యాయబద్దమైన డిమాండ్లలన్నారు లక్ష్మణ్.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర కు చెందిన నాయకులు తెలంగాణ ప్రజలను అణగదొక్కొనపుడు.. రాష్ట్రం వస్తే ఆంధ్ర ఉద్యోగుల పోస్ట్ లు తెలంగాణ యువతకు వస్తయని ఎందరో ఆత్మాహుతి చేసుకున్నారని అన్నారు లక్ష్మణ్. అయితే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంకా కొలువుల మాటే ఎత్తుతలేదని తెలిపారు.