యూపీ శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్

యూపీ శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు యోగి ఆదిత్యనాథ్ ను ఉత్తర ప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, జార్ఖండ్ మాజీ  సీఎం రఘుబర్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో..  సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాధామోహన్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, కేపీ మౌర్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ బెర్తుల కేటాయింపు, డిప్యూటీ సీఎంల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

యూపీలో ఉప ముఖ్యమంత్రులుగా ఈసారి కూడా ఇద్దరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అభ్యర్థులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, బేబీ రాణి మౌర్య, బ్రిజేష్ పాఠక్, స్వతంత్ర దేవ్ సింగ్, ఏకే శర్మ తదితరుల పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మాజీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో డిప్యూటీగా దినేష్ శర్మను కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు యోగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

మరిన్ని వార్తల కోసం 

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం

రా రైస్పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె