యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా

యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా

యూపీ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్దమైంది. అయితే ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉండగా.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ మృతిపై దానిని వాయిదా వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘లోక్ కల్యాణ్ సంకల్ప పాత్ర’ పేరుతో ఇవాళ మేనిఫెస్టోను విడుదల కార్యక్రమాన్ని షెడ్యూల్ చేశారు. నేషనలిజమ్,అభివృద్ధి, సుపరిపాలన, కాశీ, మధుర వంటి ఆలయాల అభివృద్ధి వంటి అంశాలపై మాట్లాడనున్నారు. అయితే లతా మరణంతో.. షాతో పాటు.. యూపీ సీఎం యోగి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేపీ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ సావంత్రా దేవ్ సింగ్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

ఈ సందర్భంగా యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఇక లేరన్నారు. అలాంటి వారు వందల ఏళ్లకు ఒకసారి పుడతారన్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ.. ఇవాళ నిర్వహించనున్నా బీజేపీ మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసిందని తెలిపారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామన్నారు స్వతంత్ర దేవ్. 

ఈనెల ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10,14,20,23,27, మార్చి 3,7 తేదీల్లో కలిపి మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 312 సిట్లలో విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీ 47 సీట్లు, బీఎస్పీ 19 కాంగ్రెస్ మాత్రం కేవలం ఏడు సీట్లలో మాత్రమే గెలిచింది. 

ఇవి కూడా చదవండి:

లతా మరణం తీరని లోటు

ముంబైకు మోడీ.. లతాజీకి నివాళుర్పించనున్న ప్రధాని