ముంబైకు మోడీ.. లతాజీకి నివాళుర్పించనున్న ప్రధాని

ముంబైకు మోడీ.. లతాజీకి నివాళుర్పించనున్న ప్రధాని

ప్రముఖ గాయిని, స్వర కోకిల లత మంగేష్కర్ మృతి భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. రాజికీయ, సినీ ప్రముఖులు లతాజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ ప్రేక్షకులు సంతాంపం వ్యక్తం చేశారు. తాజాగా భారత ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంతాపం తెలిపారు. ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నారు. లతా దీదీ మధురమైన గాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుందన్నారు మోడీ. లతా దీదీ స్వర్గలోకానికి వెళ్లిపోయారన్నారు. తనలాగే చాలామందికి ఆమెతో సన్నిహిత అనుబంధం ఉందని గర్వంగా చెప్పుకుంటారన్నారు. మనంఎక్కడికి వెళ్లిన ఆమె అభిమానుల్ని చూస్తుంటామననారు. బరువెక్కిన హృదయంతో లతాజీకి నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు మోదీ ఈరోజు ముంబైకి వెళ్లనున్నారు. 

సాయంత్రం  5:45-6:00 గంటల ప్రాంతంలో మోడీ.. లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరిగే గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:15-6:30 గంటలకు లతాజీ అంత్యక్రియలు నిర్వహిస్తామని..  ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహెల్ పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు లతాజీ ఇంటికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. హీరోయిన్ శ్రద్ధకపూర్, అనుపమ్ ఖేర్, జావెద్ అక్తర్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ లతా నివాసానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులకు పరామర్శించారు.

 

 

ఇవి కూడా చదవండి:

లతాజీ మరణంతో పాట మూగ బోయింది

 

రికార్డు సృష్టించిన లతా మంగేష్కర్