13వ రౌండ్‌లో బీజేపీకి భారీ ఆధిక్యం

13వ రౌండ్‌లో బీజేపీకి భారీ ఆధిక్యం

13వ రౌండులో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది. 13వ రౌండ్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటలకు 4836 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 2971 ఓట్లు, కాంగ్రెస్‌కు 101 ఓట్లు వచ్చాయి. 13వ రౌండులో బీజేపీ 1,865 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో ఇదే అత్యధిక మెజారిటీ. 9వ రౌండ్‌లో 1,835 ఓట్ల మెజారిటీ రాగా, దానికి మించి ఈ 13వ రౌండ్‌లో లీడ్ వచ్చింది. 13వ రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 58,333 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 49,945 ఓట్లు, కాంగ్రెస్‎కు 1830 ఓట్లు నమోదయ్యాయి. 13 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు.

13వ రౌండ్

బీజేపీ: 4,836 

టీఆర్‌‌ఎస్: 2,971

కాంగ్రెస్: 101

బీజేపీ లీడ్: 1,865

12వ రౌండ్‌లో ఈటల పైచేయి

హుజురాబాద్ బై ఎలక్షన్‌ కౌంటింగ్‌లో బీజేపీ మళ్లీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పదకొండో రౌండ్‌లో టీఆర్‌‌ఎస్ స్వల్ప మెజారిటీ తెచ్చుకోగా.. 12వ రౌండులో బీజేపీ ఆధిక్యం సాధించింది. 12వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 4,849 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3,632 ఓట్లు, కాంగ్రెస్‎కు 158 ఓట్లు వచ్చాయి. 12వ రౌండులో బీజేపీ 1,217 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 12 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 53,497 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 46,974 ఓట్లు, కాంగ్రెస్‎కు 1,729 ఓట్లు నమోదయ్యాయి. 12వ రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6,523 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు.

12వ రౌండ్‌

బీజేపీ: - 4,849

టీఆర్‌‌ఎస్: - 3,632

కాంగ్రెస్: 158

టీఆర్‌‌ఎస్ లీడ్‌: - 1,217

మరో రౌండ్‌లో టీఆర్‌‌ఎస్‌కు ఆధిక్యం

హుజురాబాద్ బై ఎలక్షన్‌ కౌంటింగ్‌లో మరోసారి టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. పదకొండో రౌండ్‌లో 367 ఓట్ల లీడ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు టీఆర్ఎస్ కేవలం రెండు రౌండ్లలోనే లీడ్ సాధించింది. పదకొండో రౌండ్ లెక్కింపులో ఈటలకు 3941 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4326 ఓట్లు, కాంగ్రెస్‎కు 104 ఓట్లు వచ్చాయి. పదో రౌండులో బీజేపీ 367 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. పది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 48,648 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 43,324 ఓట్లు, కాంగ్రెస్‎కు 1571 ఓట్లు నమోదయ్యాయి.  11వ రౌండ్‌లో టీఆర్‌‌ఎస్‌కు లీడ్ వచ్చినా.. ఓవరాల్‌గా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,306 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. అయితే టీఆర్‌‌ఎస్‌కు ఎనిమిదో రౌండ్‌లో 162 ఓట్ల మెజారిటీ వచ్చింది.

11వ రౌండ్‌

బీజేపీ: - 3,941

టీఆర్‌‌ఎస్: - 4,308

కాంగ్రెస్: 104

టీఆర్‌‌ఎస్ లీడ్‌: 367

పదో రౌండ్‌లోనూ బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. పదో రౌండ్‌‌‌లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4,235 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3,709 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. పది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 44,647 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 39,016 ఓట్లు, కాంగ్రెస్‎కు 2,524 ఓట్లు నమోదయ్యాయి. పది రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,631 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

పదో రౌండ్ 

బీజేపీ 4,235

టీఆర్ఎస్ 3,709

కాంగ్రెస్ 94

బీజేపీ లీడ్ 526

తొమ్మిదో రౌండ్‌లో బీజేపీకి భారీ లీడ్

తొమ్మిదో రౌండ్‌లోనూ బీజేపీ దూకుడును కనబర్చింది. ఈ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 5,305 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 3,470, కాంగ్రెస్‌కు 174 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో బీజేపీ 1,835 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 9వ రౌండ్‌లోనే అధిక మెజార్టీ వచ్చింది. తొమ్మిది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 40,412 ఓట్లు, టీఆర్ఎస్‌కు 35,307, కాంగ్రెస్‌కు 2,524 ఓట్లు వచ్చాయి. 

తొమ్మిదో రౌండ్ 

బీజేపీ 5,305 

టీఆర్ఎస్ 3,470

కాంగ్రెస్ 174

బీజేపీ లీడ్ 1,835 

ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్

టీఆర్ఎస్ తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు సొంతూరు హిమ్మత్ నగర్‌లో లీడింగ్ వచ్చింది. ఎనిమిదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4,086 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4,248 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్‌‌లో టీఆర్ఎస్ 162 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఎనిమిది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 35,107 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 31,837 ఓట్లు నమోదయ్యాయి. ఎనిమిది రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,270 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

ఎనిమిదో రౌండ్

బీజేపీ 4,086

టీఆర్ఎస్ 4,248

కాంగ్రెస్ 94

టీఆర్ఎస్ లీడ్ 162

వరుస రౌండ్లలో బీజేపీ ఆధిక్యం.. ఏడో రౌండ్‌లోనూ

ఏడో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏడో  రౌండ్ లెక్కింపులో ఈటలకు 4,038 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3,792 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండులో బీజేపీ 246 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 31,021 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 27,589 ఓట్లు, కాంగ్రెస్‎కు 1,086 ఓట్లు నమోదయ్యాయి. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3432 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

ఏడో రౌండ్

బీజేపీ 4,038

టీఆర్ఎస్ 3,792

కాంగ్రెస్ 1,086

బీజేపీ లీడ్ 246

ఆరులోనూ బీజేపీదే ఆధిక్యం

ఆరో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4656 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3639 ఓట్లు, కాంగ్రెస్‎కు 180 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండులో బీజేపీ 1017 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 26,983 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 23,797 ఓట్లు, కాంగ్రెస్‎కు 992 ఓట్లు నమోదయ్యాయి. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,186 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

ఆరో రౌండ్

బీజేపీ 4,656

టీఆర్ఎస్ 3,639

కాంగ్రెస్ 180

బీజేపీ లీడ్ 1,017

తగ్గని బీజేపీ దూకుడు

ఐదు రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4358 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4014 ఓట్లు, కాంగ్రెస్‎కు 132 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండులో బీజేపీ 344 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 22,327 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 20,158 ఓట్లు, కాంగ్రెస్‎కు 812 ఓట్లు నమోదయ్యాయి. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

ఐదో రౌండ్

బీజేపీ 4,358

టీఆర్ఎస్ 4,014

కాంగ్రెస్ 132

బీజేపీ లీడ్ 344

నాలుగో రౌండ్‌‌‎లోనూ తగ్గని బీజేపీ జోరు

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలలో బీజేపీ మొదటినుంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4444 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3882 ఓట్లు, కాంగ్రెస్‎కు 234 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండులో బీజేపీ 562 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 17,969 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు నాలుగురౌండ్లలో కలిపి 16,144 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‎కు నాలుగురౌండ్లలోనూ కలిపి 680 ఓట్లు నమోదయ్యాయి. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1825 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

నాలుగో రౌండ్

బీజేపీ 4,444

టీఆర్ఎస్ 3,882

కాంగ్రెస్ 234

బీజేపీ లీడ్ 562

మూడో రౌండ్‎లోనూ బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ పట్టణంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఉపఎన్నిక సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావులు  ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అయినా కూడా పట్టణంలో మూడోరౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మూడోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4064 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3159 ఓట్లు, కాంగ్రెస్‎కు 107 ఓట్లు వచ్చాయి. మూడోరౌండులో బీజేపీ 905 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 13,525 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు మూడురౌండ్లలో కలిపి 12,262 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు మూడురౌండ్లలోనూ కలిపి 446 ఓట్లు నమోదయ్యాయి. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1263 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

మూడో రౌండ్

బీజేపీ 4,064

టీఆర్ఎస్ 3,159

కాంగ్రెస్ 107

బీజేపీ లీడ్ 1,263 

రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ముందంజలో ఉంది. రెండోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4851 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4659 ఓట్లు, కాంగ్రెస్‎కు 220 ఓట్లు వచ్చాయి. రెండోరౌండులో బీజేపీ 192 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 9461 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు రెండురౌండ్లలో కలిపి 9103 ఓట్లు లభించాయి. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి 358 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

రెండో రౌండ్

బీజేపీ 4,851

టీఆర్ఎస్ 4,659

కాంగ్రెస్ 220

బీజేపీ లీడ్ 192

తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ బోణీ కొట్టింది. హుజురాబాద్ మండలానికి చెందిన ఈవీఎంల లెక్కింపులో ఈటలకు 4610 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్ కు 4444 ఓట్లు, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. తొలిరౌండులో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది.

తొలి రౌండ్

బీజేపీ 4,610

టీఆర్ఎస్ 4,444

కాంగ్రెస్ 119

బీజేపీ లీడ్ 166

నోటా 51