వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • హైకోర్టు తీర్పుతో తిరిగి మొదలు
  • గురువారం రాత్రి స్టేషన్ ఘన్ పూర్​కు చేరుకున్న సంజయ్

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర తిరిగి పామూరు నుంచే మొదలుకానుంది. ఈ నెల 23న స్టేషన్ ఘన్ పూర్ మండలం పామూరు వద్ద పాదయాత్రను పోలీసులు భగ్నం చేయగా.. ఆ పార్టీ నాయకులు కోర్టుకెక్కారు. పాదయాత్ర నిర్వహించుకోవచ్చని తీర్పు రావడంతో.. నేడు తిరిగి ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ గురువారం రాత్రే స్టేషన్ ఘన్ పూర్​ కు చేరుకున్నారు.

హైకోర్టు తీర్పు టీఆర్ఎస్​కు చెంపపెట్టు

పాదయాత్ర కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు, టీఆర్ఎస్ కు చెంపపెట్టు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం స్టేషన్ ఘన్ పూర్​లో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దశమంతరెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు ఎన్నో కుట్రలు చేశారన్నారు. పోలీసులను పనోళ్లలా వాడుకుని, పాదయాత్రను భగ్నం చేయాలని చూశారని పేర్కొన్నారు. తీర్పును అనుసరించి, షెడ్యూల్ ప్రకారమే పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వరంగల్ లో నిర్వహించే ముగింపు సభకు జనగామ నుంచి 11వేల మందిని తరలించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మాదాసు వెంకటేశ్, బొజ్జపల్లి సుభాశ్, నియోజకవర్గ ఇన్​చార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వార్డెన్ సస్పెన్షన్

గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు గిరిజన బాలికల హాస్టల్ వార్డెన్​అనితను సస్పెండ్ చేస్తూ.. డీడీ మంకిడి ఎర్రయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనిత స్టూడెంట్లకు సరైన భోజనం పెట్టకపోవడంతో పాటు తరచూ వేధించేది. తన భర్తతో కలిసి  హాస్టల్​కు మంజూరైన బియ్యాన్ని కాజేసేది. బుధవారం స్టూడెంట్లు ధర్నాకు దిగడంతో.. అడిషనల్ కలెక్టర్ అభిలాష అభివన్ హాస్టల్ ను పరిశీలించారు. స్టూడెంట్ల ఆరోపణలు నిజమని తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న గట్టి రమాదేవికి డిప్యూటీ వార్డెన్​గా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా, గురువారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాస్టల్​ను పరిశీలించారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ రావు  బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్​చార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి తదితరులు ఉన్నారు.

ముగింపు సభను సక్సెస్ చేయాలి

హనుమకొండ సిటీ, వెలుగు: ఈ నెల 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్​గ్రౌండ్​లో నిర్వహించనున్న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని, ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పార్టీ సీనియర్​నేత, మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి కోరారు. బండి సంజయ్​పాదయాత్రకు కోర్టు సానుకూలంగా తీర్పునివ్వగా.. గురువారం మధ్యాహ్నం పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని తిప్పలు పెట్టినా కోర్టు మాత్రం ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకే అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర పై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలు సాధించిన విజయమన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, జిల్లా ఇన్​చార్జి  మురళీధర్ గౌడ్, లీడర్లు చాడ శ్రీనివాస్ రెడ్డి, కొండాపురం జగన్, గూడూరు సుదర్శన్, దేశిని సదానందం గౌడ్, ఆర్పీ జయంత్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​లోని పాకాల సెంటర్​లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి గురవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.కోటి సాయం చేస్తామన్నారు. రాజకీయాలకతీతంగా గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.

ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి

రేగొండ: ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. గురువారం రేగొండ మండలకేంద్రంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ లో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. ఎస్సారెస్పీ కాలువలను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కొత్తగా మంజూరైన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రెస్ క్లబ్ ప్రారంభం

భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండల ప్రెస్ క్లబ్ ను గురువారం ఎమ్మెల్యే సతీశ్​ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ శాశ్వత భవనానికి 5గుంటల జాగతో పాటు రూ.15లక్షలకు కేటాయిస్తామన్నారు. విలేకర్లకు.... ఇండ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జడ్పీటీసీ వంగ రవి, ఎంపీపీ అనిత, సర్పంచ్ కొమురయ్య తదితరులున్నారు. అనంతరం పలువురికి ఆసరా పెన్షన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి

పరకాల: నిరుపేదలకు కల్యాణలక్ష్మి వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. టీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక ఆడ పిల్లల పెండ్లిళ్లు చేయడం ఈజీ అయిందన్నారు.

నక్సలైట్లు ఆలోచన చేయాలి

మహాముత్తారం, వెలుగు: మంథని నియోజకవర్గంలో దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా పోరాడి, అభివృద్ధికి పాటుపడుతున్నామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. నక్సలైట్లు తనతోపాటు ఎస్సీలపై లెటర్లు రాయడం సరికాదని, మరోసారి ఆలోచన చేయాలన్నారు. గురువారం ఆయన మహాముత్తారం మండలం కోనంపేటలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో గత 40 ఏండ్లుగా అరాచకాలు, దోపిడీలపై పోరాడుతున్నామని, తమపై నక్సలైట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంట నాయకులు కల్వచర్ల రాజు, మందల రాజిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, మెండ వెంకటస్వామి తదితరులున్నారు.

ఎస్ఐహెచ్ ఫైనల్స్ షురూ

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో స్మార్ట్ ఇండియా హాకథాన్(ఎస్ఐహెచ్) ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ గెస్టులుగా సెంట్రల్ టెక్నికల్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఐటీ డైరెక్టర్ ఝాన్సిలక్ష్మీ, నిట్ ప్రొఫెసర్ సుబ్రమణ్యం, కాలేజీ చైర్మన్ తాళ్ల మల్లేశం హాజరై ప్రోగ్రాంను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 186 మంది స్టూడెంట్లు తమ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అనంతరం ఝాన్సిలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే సత్తా ఎలక్ట్రానిక్స్,  ఐటీ రంగాలకు ఉందన్నారు. ఈ హాకథాన్ లో స్టూడెంట్లు తమ టాలెంట్​ను వెలికితీయాలన్నారు. అనంతరం రాత్రి 8గంటలకు ప్రధాని మోడీ స్టూడెంట్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

యాక్సిడెంట్​లో టీచర్ మృతి

కాజీపేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో  ప్రభుత్వ టీచర్ మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం కాజీపేట చౌరస్తాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాజీపేట దర్గా రోడ్ భీమ్​రావు నగర్​లో నివాసం ఉంటున్న మాలోతు రమేశ్(49) మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. కాజీపేట నుంచి ట్రైన్​లో రాకపోకలు సాగించేవాడు. విధుల్లో భాగంగా బుధవారం ఉదయం స్కూల్​కి వెళ్లాడు. రాత్రి అక్కడే బస చేసి, గురువారం తెల్లవారుజామున కాజీపేటకు బయలుదేరాడు. ఉదయం 4.30గంటల ప్రాంతంలో కాజీపేట నుంచి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. కాజీపేట చౌరస్తాలోని సిగ్నల్ వద్దకు రాగానే డీజిల్ కాలనీ నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో స్పాట్​లో రమేశ్ చనిపోయాడు. 

స్వాతంత్ర్య సమరయోధుడి మృతి..

ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్ మండలకేంద్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు కొదురుపాక వెంకటయ్య మృతిచెందారు. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. పరిస్థితి క్షీణించి బుధవారం రాత్రి చనిపోయారు. పలువురు నాయకులు నివాళి అర్పించారు.

ఎస్ఐహెచ్ ఫైనల్స్ షురూ

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో స్మార్ట్ ఇండియా హాకథాన్(ఎస్ఐహెచ్) ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ గెస్టులుగా సెంట్రల్ టెక్నికల్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఐటీ డైరెక్టర్ ఝాన్సిలక్ష్మీ, నిట్ ప్రొఫెసర్ సుబ్రమణ్యం, కాలేజీ చైర్మన్ తాళ్ల మల్లేశం హాజరై ప్రోగ్రాంను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 186 మంది స్టూడెంట్లు తమ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అనంతరం ఝాన్సిలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే సత్తా ఎలక్ట్రానిక్స్,  ఐటీ రంగాలకు ఉందన్నారు. ఈ హాకథాన్ లో స్టూడెంట్లు తమ టాలెంట్​ను వెలికితీయాలన్నారు. అనంతరం రాత్రి 8గంటలకు ప్రధాని మోడీ స్టూడెంట్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

వారంలో సమస్యలు పరిష్కరిస్తాం

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా ఐటీడీఏ పరిధిలోని ప్రజల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని పీవో అంకిత్ తెలిపారు. ప్రతి గురువారం జిల్లాలోని కొత్తగూడ రైతు వేదికలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. గురువారం కూడా దర్బార్ నిర్వహించగా.. కొత్తగూడతో  పాటు గూడూరు, గంగారం మండలాలకు చెందిన గిరిజనులు హాజరయ్యారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, మూడు రోజుల్లో అది ఏ స్టేజీలో ఉందో చెప్తామన్నారు. కాగా, ఈ దర్బార్ లో మొత్తం 131 దరఖాస్తులు రాగా, ఇందులో పోడు పట్టాలు, రోడ్ల సమస్యలు, గిరి వికాసం పథకం మీదే ఎక్కువగా ఉన్నాయి. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీడీ ఎర్రయ్య, ఏటీడీవో భాస్కర్ తదితరులున్నారు.

నక్సలైట్లు ఆలోచన చేయాలి

మహాముత్తారం, వెలుగు: మంథని నియోజకవర్గంలో దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా పోరాడి, అభివృద్ధికి పాటుపడుతున్నామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. నక్సలైట్లు తనతోపాటు ఎస్సీలపై లెటర్లు రాయడం సరికాదని, మరోసారి ఆలోచన చేయాలన్నారు. గురువారం ఆయన మహాముత్తారం మండలం కోనంపేటలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో గత 40 ఏండ్లుగా అరాచకాలు, దోపిడీలపై పోరాడుతున్నామని, తమపై నక్సలైట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంట నాయకులు కల్వచర్ల రాజు, మందల రాజిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, మెండ వెంకటస్వామి తదితరులున్నారు.

టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే

గల్లీలో లొల్లి..ఢిల్లీలో దోస్తీ

జనగామ, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని, గల్లీలో లొల్లి పెట్టుకుని.. ఢిల్లీలో దోస్తీ చేస్తాయని కాంగ్రెస్​ జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వచ్చే నెల 4న కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు అన్ని జిల్లాల్లోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ కొట్లాటలు జనాలను మభ్య పెట్టేందుకేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి చూపేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ అక్రమాలపై కేంద్రం ఎందుకు విచారణ జరిపించడం సమాధానం చెప్పాలన్నారు. ఆయన వెంట పార్టీ లీడర్లు డాక్టర్​లక్ష్మీనారాయణ నాయక్, వేమల్ల సత్యనారాయణ, మేడ శ్రీనివాస్, జగదీశ్​చందర్ రెడ్డి, బనుక శివరాజ్ యాదవ్ తదితరులున్నారు.

వీఆర్ఏల మహాధర్నా

ములుగు, వెలుగు: వీఆర్ఏల నిరసన 32వ రోజు కొనసాగింది. గురువారం ములుగు జిల్లాకేంద్రంలో బతుకమ్మ, బోనాలతో మహాధర్నా నిర్వహించారు. డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీ తీసి, మానవహారం నిర్వహించారు. వీరి ధర్నాకు ట్రెసా జిల్లా అధ్యక్షుడు రాజ్ ప్రకాశ్​మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పేస్కేల్ ను అమలు చేయాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు దాటిన వారికి రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నేడు కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్నారు.

బీజేపీ గెలిస్తే ముక్కు నేలకు రాస్తా..

జనగామ, వెలుగు: తెలంగాణకు ఏం చేస్తున్నారో చెప్పకుండా పాదయాత్ర చేయడం ఎందుకని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​రెడ్డి విమర్శించారు. బీజేపీకి పిడికెడు మంది కార్యకర్తలు కూడా లేరని, ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కనీసం ఒక్క సీటు గెలిచినా తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. గురువారం జనగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్రతో జనాలకు ఒరిగేదేమీ లేదని, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అమర్యాదగా మాట్లాడితే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకుంటామన్నారు. రాష్ర్టంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. లీడర్లు నామాల బుచ్చయ్య, పసుల ఏబేలు తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో భూకబ్జా!

  • రూ.2కోట్ల ప్రభుత్వ స్థలానికి ఎసరు
  • జేసీబీలతో ట్రెంచ్ కొట్టిన వైనం
  • అధికార పార్టీ నేతల హస్తం?

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​లో భూకబ్జా వెలుగుచూసింది. టౌన్​లో కొత్తగా 250 పడకల ఆసుపత్రి నిర్మిస్తుండగా.. దీనికి పది ఎకరాల జాగను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేశారు. జేసీబీలతో ల్యాండ్ చుట్టూ ట్రెంచ్ కొట్టించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే..

టౌన్ శివారు సర్వాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 62లో 19.37 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండేది. ఇందులో ఆరుగురు రైతులు సాగు చేసుకునేవారు. 2017లో ఫార్మా కంపెనీ అధినేత దొడ్డా మోహన్​రావు పేదలకు ఇండ్లు కట్టించాలనే ఉద్దేశంతో తనవంతు సాయంగా ఆ భూమిని కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అప్పగించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.5లక్షల చొప్పున చెల్లించారు. ఒక రైతు మాత్రం చెక్కు తీసుకునేందుకు అప్పట్లో రాలేదు. కాగా, అందులో ప్రభుత్వం నేటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించ లేదు. ఇదిలా ఉండగా, ఇటీవల నర్సంపేటకు 250 పడకల ఆసుపత్రి మంజూరు కాగా, అదే స్థలంలో 10 ఎకరాలను ఆసుపత్రి కోసం సర్కారు కేటాయించింది. రెవెన్యూ ఆఫీసర్లు అధికారికంగా ఆ జాగను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించారు. ప్రస్తుతం ఆసుపత్రి నిర్మాణ పనులు నడుస్తున్నాయి.

కబ్జా జరిగిందిలా..

ప్రస్తుతం నిర్మాణం అయ్యే ఆసుపత్రి చుట్టపక్కల భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుంటకు మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పలుకుతోంది. దీంతో కబ్జాకోరుల కన్ను హాస్పిటల్ ల్యాండ్ పైనే పడింది. ఒక రైతు చెక్కు తీసుకోలేదని, ఆ భూమిని తాము కొన్నామని బాహాటంగా చెబుతూ.. దర్జాగా కబ్జా చేశారు. హాస్పిటల్ నిర్మాణం అవుతున్న లాబీయింగ్ ల్యాండ్ లో.. జేసీబీతో దాదాపు రెండు ఎకరాల మేర ట్రెంచ్ కొట్టారు. దీనిపై తహశీల్దార్ వాసం రాంమూర్తిని వివరణ కోరగా.. సర్వే నంబర్​ 62లో 19.37 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని, అందులో 10 ఎకరాలను హెల్త్ డిపార్ట్ మెంట్​కు అప్పగించామన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శాఖపైనే ఉందన్నారు.

పోలీసులకు సమాచారం ఇచ్చాం 

హాస్పిటల్ భూమిలో ట్రెంచ్ కొట్టారన్న సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ట్రెంచ్​ను పూడ్చి వేయాలని సూపర్​వైజర్​ను కూడా ఆదేశించా. కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్​ గోపాల్,​ సివిల్​ హాస్పిటల్ సూపరింటెండెంట్​