దండుపాళ్యం ముఠాలా మంత్రి అనుచరులు: సంకినేని వెంకటేశ్వర్‌‌ రావు

దండుపాళ్యం ముఠాలా మంత్రి అనుచరులు:  సంకినేని వెంకటేశ్వర్‌‌ రావు

సూర్యాపేట, వెలుగు : మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు సూర్యాపేటలో దండుపాళ్యం ముఠాలా మారారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌ రావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడితే తాటా తీస్తానని చెబుతున్న మంత్రికి వెంట ఉండి అక్రమాలు చేస్తున్న వారు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.  వారి అక్రమ సంపాదనలో వాటాలు ఉన్నందునే మందలించడం లేదని ఆరోపించారు. పట్టణంలో ఎస్టీ , ఎస్టీ , బీసీ వర్గాలకు చెందిన వంద మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నా.. అన్ని పనులకు కేవలం శ్రీనివాస్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌‌కు ఎందుకు పనులు అప్పగిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. 

మంత్రి బినామీ అయిన  శ్రీనివాస్ రెడ్డి టేకుమట్ల మూసీ వాగు ఇసుకను హైదరాబాద్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన దళిత మహిళ అయిన మామిడి శ్రీలక్ష్మీకి చెందిన భూములను గండూరి ప్రకాశ్‌ తప్పుడు పత్రాలను సృష్టించి కబ్జా చేశాడని, ఆయన భావ పోతు భాస్కర్ మూసీ కాల్వ వెంట ఉన్న భూములను ఆక్రమించి షటర్లు వేశారని ఆరోపించారు.  ప్రజాస్వామ్యం కు విరుద్ధంగా ఆక్రమంగా భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడితే వట్టె జానయ్య యాదవ్ కు  పట్టిన గతి మంత్రి వెంట ఉన్న దండుపాళ్యం బ్యాచ్ కు పడుతుందన్నారు. 

ALSO READ : ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు

రాంకోటి తండాకు చెందిన బానోత్‌ వీరేందర్‌‌కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దూరజ్ పల్లికి చెందిన కౌన్సిలర్ షేష్ బాషామియా రూ. లక్ష  తీసుకున్నాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రి అనుచరులకు కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్  ఉద్యోగులను అమ్ముకు టున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జెల వెంకటరెడ్డి, నేతలు చల్లమళ్ల నరసింహా, పల్సా మల్సూర్ గౌడ్ , ఆరూర్రి శివ , బిట్టు నాగరాజు, కొప్పుల క్రాం తి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు .