కేంద్రమిచ్చిన డబ్బులను ప్రభుత్వం పక్కదారి పట్టించింది

కేంద్రమిచ్చిన డబ్బులను ప్రభుత్వం పక్కదారి పట్టించింది

ఆక్సిజన్ ప్లాంట్ల కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్ల కోసం కేంద్రం రాష్ట్రానికి 200 కోట్ల ఫండ్స్ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ ఫండ్స్‌ను పక్కదారి పట్టించింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 50 వేల పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలి. మండల జనాభా ప్రాతిపదికన డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించాలి. మారుమూల గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు.