మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

 

  • కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన నల్గొండ పోలీసులు 

నల్గొండ, వెలుగు: గణేశ్ ​శోభాయాత్ర సందర్భంగా మంత్రి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారంటూ ..? బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పాతబస్తీలోని ఒకటో నంబర్ మండపం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

 కాంగ్రెస్ నేతలు తిరిగి అడ్డుకోవడంతో గొడవకు దారితీసింది. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణకు కారణమైన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించేందుకు యత్నించారు.  వర్షిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం  ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.