జాతీయ పతాకం.. మన గౌరవానికి ప్రతీక

జాతీయ పతాకం.. మన గౌరవానికి ప్రతీక

సూర్యాపేట, వెలుగు : జాతీయ పతాకం.. మన గౌరవానికి ప్రతీక అని, ప్రతిఒక్కరూ దేశభక్తిని ప్రదర్శించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో విభజన గాయాల స్మృతిదినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి పై జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గ్రామ, పట్టణాల్లో తిరంగా ర్యాలీలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులకు జాతీయ జెండా, దేశ గౌరవంపై అవగాహన కల్పించాలని సూచించారు.

 ప్రతిఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మాల్సూర్ గౌడ్, కో –కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పార్లమెంట్ కో–కన్వీనర్ మన్మధరెడ్డి, నాయకులు కర్నాటి కిషన్, చలమల నరసింహ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.