
- ఏపీకి స్పెషల్ స్టేటస్ఇస్తే తెలంగాణ ఎడారిగా మారేది
- రాహుల్ గాంధీకి బానిసలుగా కాంగ్రెస్ నేతలు
- మమ్మల్ని సభలో మాట్లాడనిస్తలేరు
- బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం లాగే మూసీ రివర్‌ఫ్రంట్‌ను ఏటీఎంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారిగా మారేదని అన్నారు. కేంద్రానికి రాష్ట్రం పైన వివక్ష లేదని చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మేం భారతమాత, దేశ ప్రజలకు మాత్రమే బానిసలం’’ అని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి బానిసలుగా మారి తమ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్అయ్యారు. ఏపీకి పది వేల కోట్లు ఇచ్చారని పదే పదే చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి సభలో తమను మాట్లాడనివ్వడం లేదని మండిపడ్డారు.