ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిండు

ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిండు

మోడీకి మొఖం చూపించే దమ్ము, ధైర్యం లేకనే కేసీఆర్ టూర్ల పేరుతో పారిపోయారని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ తీరును ఎండగట్టారు. ఒకప్పుడు మోడీకి కాదు.. ప్రధాని పదవికి గౌరవం ఇవ్వాలన్న కేసీఆర్... ఇప్పుడు పీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని అభిప్రాయపడ్డారు.

ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని ఈటల మండిపడ్డారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ.5లక్షల కోట్లు దాటిందని చెప్పారు. కేసీఆర్ డొల్లతనాన్ని కాగ్ సైతం బయటపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేసీఆర్ అప్పులు చేసి రాజరికం అనుభవించడం తప్ప, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఈటల విమర్శించారు. కేసీఆర్ హయాంలో మంత్రులకు వారి శాఖలపైనే అవగాహన లేకుండా పోయిందని మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్

హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న శిల్పాలు