బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత

బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత

హరియాణాలోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. న్యూమోనియాతో  బాధపడుతున్న ఆయన చండీగఢ్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎంపీ రత్తన్ లాల్ కటారియా మృతి పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు.

1951 లో జన్మించిన  రతన్ లాల్  బీజేపీ అధికార ప్రతినిధిగా ,అధ్యక్షుడిగా,మంత్రిగా పనిచేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో అంబాలా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 2021 వరకు కేంద్రం జల్ శక్తి, సామాజిక న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.