అమిత్ షా ప్రోగ్రాం సక్సెస్ చేయాలి : డీకే అరుణ

అమిత్  షా ప్రోగ్రాం సక్సెస్  చేయాలి : డీకే అరుణ

గద్వాల, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్  షా పర్యటనను సక్సెస్​ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బుధవారం బహిరంగ సభ, హెలీప్యాడ్, సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 18న గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు అమిత్​ షా హాజరవుతున్నారని, ఉదయం 10 గంటలకు జరిగే సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సక్సెస్  చేయాలని కోరారు. 

జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బీజేపీ క్యాండిడేట్​ బలిగేర శివారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, రవికుమార్, పూజారి శ్రీధర్  పాల్గొన్నారు.