
అహంకారానికి ఆత్మ గౌరవాన్నికి జరిగిన ఎన్నికల్లో ఆత్మ గౌరవం విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్‌పై ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘హుజురాబాద్‌లో గెలుపు కోసం టీఆర్‌ఎస్ జల ప్రవాహంలాగా డబ్బు కుమ్మరించింది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు లొంగలేదు. సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పారు. హుజురాబాద్ ప్రజలకు నా సెల్యూట్” అని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్‌పైన ప్రజల్లో విశ్వాసం పోయిందని, దళిత బంధు ప్రారంభించిన గ్రామంలో సైతం టీఆర్ఎస్‌ను కాదని, బీజేపీకే ప్రజలు ఆధిక్యం కట్టబెట్టారని అన్నారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణకు మార్గ దర్శకులుగా నిలబడ్డారన్నారు. కులం, మతం అన్న తేడాలు లేకుండా అందరూ ఈటల రాజేందర్‌కు ఓట్లేశారని, ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని, ఇది తెలంగాణ ప్రజల విజయమని డీకే అరుణ అన్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పు చరిత్రాత్మకమని చెప్పారు. సీఎం స్వయంగా పోటీ చేసినట్టుగా ప్రజలు తీర్పు ఇచ్చారని, దీనిని కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలని అన్నారు.