
రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు నేతలు అడ్డుకున్నంత మాత్రాన బీజేపీలో చేరికలు ఆగవని స్పష్టం చేసారు. చేరికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బండి సంజయ్ ప్రకటించారు. మనుగోడులో ఉప ఎన్నిక జరిగితే బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ ఖాతాలో పడితే దేశానికున్న సమస్య తీరిపోతుందని బండి సంజయ్ అన్నారు. రాంపూర్, ఆజంఘడ్ లలో గెలిచిన పార్టీ హైదరాబాద్ లో ఎందుకు విజయం సాధించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కేవలం 15 స్థానాలు మాత్రమే గెలుస్తుందని అన్నారు. టీవీ డిబేట్లలో రోజూ బీజేపీని తిట్టే టీఆర్ఎస్ నేతలందరికీ చీకోటితో సంబంధాలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.