బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు

V6 Velugu Posted on Dec 07, 2021

  • బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు

సంగారెడ్డి: బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో నిజాం వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ నిజాం వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మంతా అవినీతి మయంగా మారిందని ఆయన ఆరోపించారు. కాకతీయ కాలం నాటి కుంటలను , చెరువులను కబ్జాకు పాల్పడ్డారని విమర్శించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఎక్కడో ఉన్న ఉన్న వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందని, రానున్న ఎన్నికలకు ప్రతి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. 


 

Tagged Bjp, Telangana, meeting, Muralidhar Rao, national leader, bjp leader, Medak, Sangareddy, training class

Latest Videos

Subscribe Now

More News